అయ్యో.. బిడ్డా!

  పసికందును బతికించేందుకు వైద్యుల ప్రయత్నం తల్లిగర్భంలోనే పసికందు మృతి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదఛాయలు ఖమ్మం : పెళ్లి తర్వాత అత్త ఇల్లే స్త్రీకి పుట్టిలు.. వారి బంధం అనిర్వచరీయం. అత్తతో పాటే కొడలు మరణించిన సంఘటన ఖమ్మం రూరల్ మండలంలో నీటిలో కారు పడిన ప్రమాదంలో చొటుచేసుకుంది. ఈ సంఘటనలో ఇదే విషాద విషయం అంటే తల్లిగర్భంలోనే పసికందుకు నూరెళ్లు నిండటం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. రెండు కుటుంబాల్లో ఈ సంఘటన విషాదం నింపింది. […] The post అయ్యో.. బిడ్డా! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పసికందును బతికించేందుకు వైద్యుల ప్రయత్నం
తల్లిగర్భంలోనే పసికందు మృతి
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదఛాయలు

ఖమ్మం : పెళ్లి తర్వాత అత్త ఇల్లే స్త్రీకి పుట్టిలు.. వారి బంధం అనిర్వచరీయం. అత్తతో పాటే కొడలు మరణించిన సంఘటన ఖమ్మం రూరల్ మండలంలో నీటిలో కారు పడిన ప్రమాదంలో చొటుచేసుకుంది. ఈ సంఘటనలో ఇదే విషాద విషయం అంటే తల్లిగర్భంలోనే పసికందుకు నూరెళ్లు నిండటం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. రెండు కుటుంబాల్లో ఈ సంఘటన విషాదం నింపింది. ఖమ్మం రూరల్ మండలంలో గొల్లగూడెం వద్ద సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన టాటా ఇండికా కారులో అత్తా కొడలు పొగుల ఇందిర(48), పొగుల స్వాతి(28) సంఘటన స్థలంలో మరణించగా, స్వాతి భర్త మహిపాల్‌రెడ్డిని స్థానికులు రక్షించారు.

అనంతరం వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. స్వాతి గర్భిణి, 9 నెలలు నిండాయి. మరో వారం పది రోజుల్లో కాన్పు కావాల్సి ఉంది. దీంతో ఆమె కడుపులోని పసికందు కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చివరి ప్రయత్నాలు చేశారు. స్వాతికి గైనకాలజిస్ట్ రాధారుక్మిణి ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీశారు. పండంటి మగబిడ్డ. 2.5 కిలోల బరువు ఉన్నాడు.

శిశువులో ఎటువంటి కదలికలు లేకపోవటంతో పిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ ప్రత్యూష శిశువుకు ఇంజక్షన్ చేశారు. చివరి వరకు వైద్యులు, సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తల్లిగర్భంలోనే పసికందు మరణించినట్లు వైద్యులు తెలిపారు. సంఘటన చూస్తే తమకే కన్నీరు వస్తుందని వైద్యులు, సిబ్బంది కంటతడిపెట్టారు.

రెండు కుటుంబాల్లో విషాదం
మహబూబాద్‌జిల్లా చిన్నగూడురు మండలం జయరామ్ ప్రాంతానికి చెందిన పొగుల మహిపాల్‌రెడ్డి ఇదే జిల్లా నెల్లికుదురులో ట్రాన్స్‌కో ఆర్టిజెన్ గ్రేడ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. రెండున్న సంవత్సరాల కిందట మహబూబాద్‌జిల్లా నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన స్వాతితో వివాహమైంది. ప్రస్తుతం వారు మరిపెడ బంగ్లాలో నివాసముంటున్నారు. ఎంతో అనోన్యంగా కాపురం చేసుకుంటున్నారు. మొదటి కాన్పు కావటంతో స్వాతిని వైద్య చికిత్సల కోసం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొస్తున్నారు.

మరికొద్దిరోజుల్లో పండంటి బిడ్డకు జన్మను ఇవ్వాల్సిన స్వాతి అనుకొని ప్రమాదంలో మరణించిటంతో ఆమె భర్త మహిపాల్‌రెడ్డి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పుట్టిన మగబిడ్డకు తల్లిగర్భంలోనే నిండు నూరెళ్లు నిండటంతో ఆ కుటుంబాన్ని మరింత విషాదం నింపింది. మరో వైపు స్వాతి తల్లిదండ్రులు ఈట్టె దామోదర్‌రెడ్డి, పద్మ ఆసుపత్రిలో కుమార్తె మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కాగా స్వాతి రెండో కుమార్తె. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురి వద్ద రెండు కుటుంబాల రోదనలతో విషాదఛాయలు అలుముకున్నాయి.

Aunt and Daughter-in-law died in Car accident

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అయ్యో.. బిడ్డా! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.