ముగ్గురు పిల్లలున్నా పోటీచేయొచ్చు

 పురపాలక సవరణ చట్టానికి మండలి ఆమోదం  విధుల్లో నిర్లక్షం వహిస్తే కఠిన చర్యలు : కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్: పురపాలక ఎన్నికల్లో ఇకపై ముగ్గురు పిల్లలు ఉన్నా పోటీ చేయవచ్చని పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కెటిఆర్) అన్నారు. శాసనమండలిలో ఆదివారం ఉదయం పురపాలక సవరణ చట్టాన్ని మంత్రి కెటిఆర్ ప్రవేశపెట్టారు. చర్చ జరిగిన తర్వాత చట్టాన్ని మండలి ఆమోదించింది. సవరణ చట్టంపై సభ్యులు భాను ప్రకాష్, గంగాధర్ గౌడ్, రాంచంద్రారావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, […] The post ముగ్గురు పిల్లలున్నా పోటీచేయొచ్చు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 పురపాలక సవరణ చట్టానికి మండలి ఆమోదం
 విధుల్లో నిర్లక్షం వహిస్తే కఠిన చర్యలు : కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: పురపాలక ఎన్నికల్లో ఇకపై ముగ్గురు పిల్లలు ఉన్నా పోటీ చేయవచ్చని పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కెటిఆర్) అన్నారు. శాసనమండలిలో ఆదివారం ఉదయం పురపాలక సవరణ చట్టాన్ని మంత్రి కెటిఆర్ ప్రవేశపెట్టారు. చర్చ జరిగిన తర్వాత చట్టాన్ని మండలి ఆమోదించింది. సవరణ చట్టంపై సభ్యులు భాను ప్రకాష్, గంగాధర్ గౌడ్, రాంచంద్రారావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, నర్సిరెడ్డి, కర్నె ప్రభాకర్ తదితరులు మాట్లాడారు. అనంతరం మంత్రి కెటిఆర్ సభ్యులకు సమాధానం ఇస్తూ పారిశుద్ధం, పచ్చదనం నిర్వహణ ప్రజలందరి ఉమ్మడి బాధ్యత అని, కేవలం మునిసిపల్ ఉద్యోగులే చేయాలంటే, సాధ్యంకాదన్నారు. ఎంతో కొంత భయం లేకపోతే, ప్రజా ప్రతినిధులైనా, ఉద్యోగులైనా, తమ బాధ్యతలు, విధులపై సరైన దృష్టిని పెట్టరని అన్నారు. అందుకోసమే విధుల్లో నిర్లక్షం చేస్తే ప్రజా ప్రతినిధులైనా, ఉద్యోగులపైనా చర్యలు తీసుకునేలా చట్టం రూపొందించామన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వాళ్లు చట్టాన్ని పూర్తిగా చదవాలని, విధుల్లో నిర్లక్షం చేస్తే తొలగిస్తామని, తర్వాత ప్రభుత్వాన్ని నిందించవద్దని మంత్రి ఔత్సాహికులకు జాగ్రత్తలు చెప్పారు.

కొత్త మునిసిపాలిటీలు ఏర్పాటు చేయాలంటే, ఇకపైన అసెంబ్లీ తీర్మానం ద్వారానే సాధ్యమవుతుందని, రాష్ట్రంలో ఇకపై నగర పంచాయతీలు ఉండవని పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు విధులను నిర్వచించినట్లుగానే నిధులు కూడా దండిగా ఇస్తామని చెప్పారు. కేంద్ర ఆర్ధిక సంఘం నుంచి రూ.1038 కోట్లు వస్తే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా రూ.1038 కోట్లు ఇచ్చి, మొత్తంగా స్థానిక సంస్థలకు రూ.2072 కోట్లు అందజేస్తున్నామన్నారు. గతంలో మునిసిపాలిటీల్లో ఉన్న నిధులన్నీ తాగునీటి కోసమే ఖర్చయ్యేవని, ఇప్పుడు మిషన్ భగీరథతో తాగునీటి సరఫరా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని మంత్రి పేర్కొన్నారు. వీధి దీపాల నిర్వహణకు చాలా డబ్బులు వెచ్చించాల్సి వస్తుందని, ఇప్పుడు అన్నింటినీ ఎల్‌ఇడిలతో మార్చడం మూలంగా కరెంటు బిల్లులు 50 శాతం తగ్గుతున్నాయన్నారు. తాగునీటి సరఫరా భారం, వీధి దీపాల కరెంటు బిల్లులు తగ్గడంతో ఆయా ఖర్చులు మునిసిపాలిటీలకు మిగులుతాయని మంత్రి వివరించారు. దీంతో పాటు యువజన కమిటీ, సీనియర్ సిటిజెన్స్ కమిటీ, మహిళా కమిటీ, స్వయంసహాయక బృందాలు, కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ సంఘాలతో కలిపి మరో కమిటీని మునిసిపాలిటీల్లో ఏర్పాటు చేస్తామని, వీరు ప్రతి మూడు నెలల కోసారి సమావేశమై పాలకవర్గానికి సలహాలు, సూచనలు ఇవ్వాల్సి ఉంటుందని, ఆయా సూచనలపై పాలకవర్గాల సమావేశంలో చర్చించేలా నిబంధనలు పొందుపరిచామన్నారు.

ఫలితంగా పాలనలో పౌరులకు భాగస్వామ్యం కల్పిస్తున్న గొప్ప చట్టం పురపాలక చట్టమని మంత్రి ప్రకటించారు. 75 గజాల్లోపు 100 టాక్స్‌తో, 600 గజాల్లోపు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకుంటే, 21 రోజుల్లో అనుమతినిచ్చేలా గడువు విధించామన్నారు. అన్ని మునిసిపాలిటీలలో ఎలక్ట్రానిక్ ఆఫీస్ వ్యవస్థ ప్రవేశపెడుతున్నామన్నారు.
అనుమతి వచ్చాక నిర్మాణాలు కూడా 3 ఏళ్లలో పూర్తిచేయాలని, నగరాల్లో అయితే 5 ఏళ్లలో పూర్తిచేయాలని సూచించారు. ప్రజాప్రతినిధుల తొలగింపును టిఆర్‌ఎస్ వాళ్లతోనే మొదలుపెడతామని, రాజకీయ కక్షలకు, ప్రతీకారాలకు తావులేదని మంత్రి సభ్యులకు భరోసానిచ్చారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, కేంద్ర ప్రభుత్వం చేసే చట్టాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు.

KTR Speech On Municipal Elections

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ముగ్గురు పిల్లలున్నా పోటీచేయొచ్చు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: