దేశమంతటా ఉల్లిధరల ఘాటు

ఢిల్లీలో కిలో రూ. 80 భారీ వర్షాలతో పంటనష్టం సరుకు రవాణాపై జాప్యం నిల్వలపై కట్టడికి నిర్ణయం న్యూఢిల్లీ : వంటింట్లో రోజువారి దినుసు అయిన ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లిగడ్డ చిల్లర ధర కిలోకు రూ 70 నుంచి రూ 80 వరకూ చేరింది. దేశ ంలోని దాదాపు అన్ని ప్రాంతాలలో ఈ స్థాయిలోనే ఉండటంతో ప్రజలు ప్రస్తుతం ప్యాస్ పరేషాన్‌తో సతమతం అవుతున్నారు. ఉల్లి పంట ఎక్కువగా ఉండే ప్రాంతాలలో […] The post దేశమంతటా ఉల్లిధరల ఘాటు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఢిల్లీలో కిలో రూ. 80
భారీ వర్షాలతో పంటనష్టం
సరుకు రవాణాపై జాప్యం
నిల్వలపై కట్టడికి నిర్ణయం

న్యూఢిల్లీ : వంటింట్లో రోజువారి దినుసు అయిన ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లిగడ్డ చిల్లర ధర కిలోకు రూ 70 నుంచి రూ 80 వరకూ చేరింది. దేశ ంలోని దాదాపు అన్ని ప్రాంతాలలో ఈ స్థాయిలోనే ఉండటంతో ప్రజలు ప్రస్తుతం ప్యాస్ పరేషాన్‌తో సతమతం అవుతున్నారు. ఉల్లి పంట ఎక్కువగా ఉండే ప్రాంతాలలో భారీ వర్షాలు పడటంతో చేతికంది వచ్చే పంట దెబ్బతింది. దీనితో హోల్‌సేల్ మార్కెట్లలోకి సరుకు సరఫరా గణనీయంగా తగ్గింది. ఈ పరిణామంతో ఉల్లిగడ్డల ధరలకు రెక్కలు వచ్చాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. జనజీవితాన్ని కుదేలు చేసే ఉల్లి ధరల అంశంపై కేంద్ర ప్రభు త్వం ఎట్టకేలకు దృష్టి సారించింది. ఉల్లి గడ్డ హోల్‌సేల్ వ్యాపారుల నిల్వలపై పరిమితి విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని వల్ల ఎప్పటికప్పుడు మార్కెట్‌లోకి సరుకు వెళ్లడంతో ధరల పెరుగుదల పై నియంత్రణ ఉంటుందని, ఇతరత్రా చర్యలతో ఉల్లిగడ్డను తక్కువ ధరలకు ప్రజలకు అందించాలని కేంద్రం యోచిస్తోంది.
ఉల్లిగడ్డల ధరల వివరాలు
కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న ఉల్లిగడ్డల ధరల గణాంకాలను భద్రపర్చింది. దీని మేరకు గతవారాంతంలో ఢిల్లీలో వీటి ధరలు కిలోకు రూ 70 నుంచి రూ 80 వరకూ చేరాయి. అంతకు ముందటి వారం వీటి ధర ఢిల్లీలో కిలోకు రూ 57 వరకూ ఉండేది. ముంబైలో కిలో ఉల్లి ధర రూ 55 ,కోల్‌కతాలో కిలో రూ 48, చెన్నైలో కిలో రూ 34 వరకూ గతవారం నమోదయింది. ఇక గురేగావ్, జమ్మూలలో ఇదే సమయంలో ఉల్లి ధరలు కిలోకు రూ 60గా పలికాయి. సరఫరా మెరుగుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నప్పటికీ దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఉత్పత్తి జరిగే రాష్ట్రాలలో భారీ వర్షాలతో సరఫరాలలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీనితో గృహ అవసరాలకు అందే ఉల్లి గడ్డ అందుబాటు ధరలలో ఉండని స్థితి ఏర్పడుతోందని అధికార వర్గాలు తెలిపాయి. సరుకు చాలినంతగా లేకపోవంతో ఉన్నట్లుండి రెండు మూడు రోజుల్లోనే ధరలు పెరిగాయని వెల్లడించారు.
పరిస్ధితిపై ఎప్పటికప్పుడు సమీక్ష
వచ్చే రెండు మూడురోజులలో ధరలు తగ్గుముఖం పడుతాయని అధికార యంత్రాంగం భావిస్తోంది. అనుకున్న విధంగా సరుకు మార్కెట్‌కు వస్తే ధరల నియంత్రణ వీలవుతుంది. అయితే సరుకు సరఫరా సాధారణ స్థాయికి చేరకపోతే ఏమి చేయాలనేదానిపై యంత్రాంగం దృష్టి సారించింది. వ్యాపారుల స్టాక్‌పై ఆంక్షల విధింపు చర్యలకు దిగాల్సి ఉంటుందని కూడా వెల్లడైంది. మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లలో ఉల్లి పంట ఎక్కువగా పండుతుంది. దేశంలోని ప్రధాన మార్కెట్లకు ఈ ప్రాంతాల నుంచే సరుకు అందుతుంది.
నవంబర్ వరకూ ఇదే పరిస్థితి?
ప్రస్తుతం నిల్వ ఉన్న సరుకులే పలు ప్రాంతాలలో విక్రయిస్తున్నారు. ఖరీఫ్ పంట నవంబర్ నుంచి మార్కెట్‌కు చేరుకుంటూ వస్తుంది. అప్పటి వరకూ ధరలపై ప్రభావం ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. అయితే ఇంత కు ముందటి నిల్వలు తమ వద్ద భారీగానే ఉన్నాయని, అయితే భారీ వర్షాలతో అన్ని చోట్లకు వీటిని పంపిణీ చేయలేకపోతున్నట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి.

Onion Price Hike

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post దేశమంతటా ఉల్లిధరల ఘాటు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: