నాకు, మోడీకి ఇది శుభ సమయం

హూస్టన్ వెళ్లేముందు మీడియాతో డోనాల్డ్ ట్రంప్ హూస్టన్: హౌడీమోడీ మెగా ఈవెంట్ తనకు, ప్రధాని నరేంద్రమోడీకి శుభ తరుణమని ఆ కార్యక్రమంలో ప్రసంగించాలని ఆసక్తితో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదివారం చెప్పారు. ‘మేము హూస్టన్ కు వెడుతున్నాం. ప్రధాని మోడీ కోసం వచ్చిన వారితో నిండిపోయిన పెద్ద స్టేడియంలో మేము కలుసుకోబోతున్నాం’ అని ట్రంప్ హూస్టన్ బయలుదేరే ముందు వైట్‌హౌస్ సౌత్‌లాన్స్‌లో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. అక్కడ ఆయన, మోడీ 50,000మంది ఇండియన్ అమెరికన్లను […] The post నాకు, మోడీకి ఇది శుభ సమయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హూస్టన్ వెళ్లేముందు మీడియాతో డోనాల్డ్ ట్రంప్

హూస్టన్: హౌడీమోడీ మెగా ఈవెంట్ తనకు, ప్రధాని నరేంద్రమోడీకి శుభ తరుణమని ఆ కార్యక్రమంలో ప్రసంగించాలని ఆసక్తితో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదివారం చెప్పారు. ‘మేము హూస్టన్ కు వెడుతున్నాం. ప్రధాని మోడీ కోసం వచ్చిన వారితో నిండిపోయిన పెద్ద స్టేడియంలో మేము కలుసుకోబోతున్నాం’ అని ట్రంప్ హూస్టన్ బయలుదేరే ముందు వైట్‌హౌస్ సౌత్‌లాన్స్‌లో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. అక్కడ ఆయన, మోడీ 50,000మంది ఇండియన్ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ‘మీరు నాతో వస్తారా? అని ఆయన (మోడీ) అడిగారు. నేను అంగీకరించాను. మాకిది శుభసమయం. చాలామంది జనం హాజరవుతున్నారని విన్నాను’ అని ట్రంప్ మారి న్ వన్‌లో బయలుదేరడానికి కొన్ని నిముషాలముందు చెప్పారు. లాభాపేక్ష రహితంగా టెక్సాస్ ఇండియా ఫోరం నిర్వహించే హౌడీ మోడీ ఈవెంట్‌కు ట్యాగ్ లైన్ ‘షేర్డ్ డ్రీమ్స్, బ్రైట్ ఫ్యూచర్స్’. అమెరికాలోని ఇండో అమెరికన్ల తోడ్పాటుతో ఇది అత్యంత వైభవోపేతంగా సాగడమే కాక, అమెరికా ఇండియా మధ్య బలమైన చిరకాల భాగస్వామ్యానికి బాటవేస్తుంది.
వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు
భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగానికి ముందు టెక్సాస్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ఇండో అమెరికన్ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పా టు చేశారు. అమెరికా జీవనశైలిలో భారతీయులు ఎంతగా కలిసిపోయారనేదానికి ఇది ప్రతీక అవుతుం ది. అమెరికా అంతటినుంచీ వచ్చిన వేలాది భారతీయు లు ఈ మహా వేడుకలో భాగస్వాములయ్యారు. 90 నిముషాలపాటు సంగీతం, నృత్యం, మల్టీ మీడియా షో వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశా రు. ఇండియన్ అమెరికన్‌ల జీవన వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా 27 బృందాలతో లైవ్, మల్టీ మీడియా కార్యక్రమాలు ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఏదోక దానిలో ప్రతి వ్యక్తీ లీనమైన అనుభూతి పొందుతారని మేలా ఆర్ట్ కనెక్ట్ సిఇఓ, కో ప్రొడ్యూసర్ హీనా పటేల్ చెప్పారు.

Donald Trump joins PM  Modi Howdy Modi event

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నాకు, మోడీకి ఇది శుభ సమయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: