చెలరేగిన డికాక్

చివరి టి20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయం సిరీస్‌ను సమం చేసిన సఫారీలు బెంగళూరు: బెంగళూరు వేదికగా జరిగిన ఆఖరి టి20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా అలవోకగా విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 135 పరుగుల విజయ లక్షాన్ని కేవలం ఒక వికెట్ కోల్పోయి తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ డికాక్ (79 పరుగులు నాటౌట్) మెరుపులు కురిపించడంతో కేవలం 16.5 ఓవర్లలోనే లక్షాన్ని చేరుకుని సిరీస్‌ను 1 1 తేడాతో సమం చేసింది. […] The post చెలరేగిన డికాక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చివరి టి20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయం
సిరీస్‌ను సమం చేసిన సఫారీలు
బెంగళూరు: బెంగళూరు వేదికగా జరిగిన ఆఖరి టి20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా అలవోకగా విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 135 పరుగుల విజయ లక్షాన్ని కేవలం ఒక వికెట్ కోల్పోయి తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ డికాక్ (79 పరుగులు నాటౌట్) మెరుపులు కురిపించడంతో కేవలం 16.5 ఓవర్లలోనే లక్షాన్ని చేరుకుని సిరీస్‌ను 1 1 తేడాతో సమం చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకున్న టీమిండియాను దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కట్టడి చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 134 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం బరిలోకి దిగిన డికాక్ సేన చెలరేగి ఆడింది. ఆదినుంచే భారత బౌలర్లపై విరుచుకుపడిన సఫారీ బ్యాట్స్‌మెన్ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. హెండ్రిక్(28)తో కలిసి డికాక్ తొలి వికెట్‌కు 76 పరుగులు జోడించాడు. హార్దిక్ బౌలింగ్‌లో హెండ్రిక్ ఔటవడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వచ్చిన బవుమా(27)తో కలిసి లక్షాన్ని మరో 19 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేశాడు. భారత బౌలర్లపై డికాక్ బౌండరీలతో విరుచుకు పడ్డాడు. కేవలం 52 బంతుల్లో 5 సిక్స్‌లు, ఆరు బౌండరీలతో 79 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మొహాలీ మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు. కాగా అక్టోబర్‌నుంచి మూడు టెస్టుల సిరీస్ ప్రారంభమవుతుంది.
ఆద్యంతం తడబాటే
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే చేసింది. జట్టులో శిఖర్ ధావన్ ఒక్కడే కొంతమేరకు రాణించడంతో ఆ మాత్రమైనా స్కోరు సాధ్యమైంది. క్రీజ్‌లో ఉన్నంత వరకు ధావన్ సేచ్ఛగా ఆడాడు. 25 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 36 పరుగులు చేశాడు. కాగా, భారత్‌కు ఆశించిన శుభారంభం లభించలేదు, రోహిత్ శర్మ(9) మరో సారి విఫలం కావడంతో 22 పరుగుల వద్దే తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ, ధావన్‌లు కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ధావన్ చురుగ్గా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. అయితే 63 పరుగుల వద్ద ధావన్ రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కోహ్లీ కూడా ఎక్కువ సేపు ఉండలేదు. కేవలం 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరగడంతో భారత్ పరుగుల వేగం మందగించింది. రిషబ్ పంత్(19), శ్రేయస్ అయ్యర్(5),కృనాల్ పాండే(4)లు కూడా విఫలం కావడంతో భారత్ ఇన్నింగ్స్ కుదేలయింది. చివర్లో రవీంద్ర జడేజా(19), హార్దిక్ పాండ్య(14)లు కొంత మేరకు పోరాడారు కానీ వారి బ్యాట్‌నుంచి ఆశించిన మెరుపులు రాలేదు. చివరి ఓవర్‌లో వీరిద్దరితో పాటుగా వాషింగ్టన్ సుందర్ కూడా ఔటవడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడా 3 వికెట్లు పడగొట్టగా కట్టుదిట్టంగా బౌల్ చేసిన హెండ్రిక్స్, బిజోర్న్‌లు చెరి రెండు వికెట్లు సాధించారు. షమ్సికి ఒక వికెట్ దక్కింది.

south africa won against India

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చెలరేగిన డికాక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: