చివరి రోజు మరో పతకం

61 కేజీల విభాగంలో కాంస్యం సాధించిన అవారే ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రదర్శన నూర్‌సుల్తాన్( కజకిస్థాన్): ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ చివరి రోజు కూడా భారత్ హవా కొనసాగింది.ఆదివారం 61 కెజిల కేటగిరీలో భారత్ రెజ్లర్ రాహుల్ అవారే కాంస్య పతకాన్ని సాధించాడు. కాంస్య పతకం కోసం సాగిన పోటీలో అవారే ఆద్యంతం ఆకట్టుకున్నాడు. అమెరికా రెజ్లర్ టేలర్ లీ గ్రాఫ్‌ను 11 4పాయింట్ల తేడాతో చిత్తుచేసి కాంస్య పతకాన్ని ఒడిసి పట్టుకున్నాడు. నాన్ ఒలింపిక్ […] The post చివరి రోజు మరో పతకం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

61 కేజీల విభాగంలో కాంస్యం సాధించిన అవారే
ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రదర్శన
నూర్‌సుల్తాన్( కజకిస్థాన్): ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ చివరి రోజు కూడా భారత్ హవా కొనసాగింది.ఆదివారం 61 కెజిల కేటగిరీలో భారత్ రెజ్లర్ రాహుల్ అవారే కాంస్య పతకాన్ని సాధించాడు. కాంస్య పతకం కోసం సాగిన పోటీలో అవారే ఆద్యంతం ఆకట్టుకున్నాడు. అమెరికా రెజ్లర్ టేలర్ లీ గ్రాఫ్‌ను 11 4పాయింట్ల తేడాతో చిత్తుచేసి కాంస్య పతకాన్ని ఒడిసి పట్టుకున్నాడు. నాన్ ఒలింపిక్ కేటగిరీలో జరిగిన ఈ పోటీలో అవారే ఆరంభంలో తడబడినప్పటికీ ఆ తర్వాత పుంచుకొని ప్రత్యర్థిపై పై చేయి సాధించాడు.ప్రారంభంలోనే రెండు పాయింట్లతో వెనుకబడినప్పటికీ వరసగా పాయింట్లు సాధించి విరామ సమయానికి 4 2 పాయింట్ల ఆధిక్యత సాధించాడు. విరామం తర్వాత వరస దాడులతో ప్రత్యర్థిని చిత్తు చేసి 10 2పాయింట్లతో తిరుగులేని ఆధిక్యతను సాధించాడు. చివరివరకు ఆధిక్యతను నిలబెట్టుకోవడం ద్వారా విజయంతో పాటుగా కాంస్య పతకాన్ని సాధించాడు. ఫలితంగా భారత్ ఖాతాలో అయిదు పతకాలు చేరాయి. అంతకు ముందు దీపక్ పునియా గాయం కారణంగా ఫైనల్ పోటీనుంచి వైదొలగడంతో రజత పతకానికి పరిమితమైన విషయం తెలిసిందే. కాగా, ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం. భారత్ సాధించిన అయిదు పతకాల్లో ఒకటి రజతం కాగా, మిగతా నాలుగు కాంస్య పతకాలు. దీపక్ పునియా రజతపతకం సాధించగా, బజరంగ్ పునియా, వినేశ్ ఫోగట్, రవికుమార్, రాహుల్ అవారేలు కాంస్యాలతో మెరిసారు. 2013లో భారత్ మూడు పతకాలు సాధించగా. ఇప్పటివరకు అదే అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది.

Rahul Aware best ever Bronze medal hit

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చివరి రోజు మరో పతకం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: