మహిళా దొంగ మల్లమ్మ మళ్లీ అరెస్టు

  హైదరాబాద్ : ఇళ్లల్లో దొంగతనాలు చేస్తున్న మహిళను నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితురాలి వద్ద నుంచి 135.2 గ్రాముల బంగారు ఆభరణాలు, 50 గ్రాముల వెండి వస్తువులు, లేడీస్ వాచ్‌లు 7 స్వాధీనం చేసుకున్న మొత్తం వస్తువుల విలువ రూ. 4,70,000 ఉంటుంది. పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్, బేగంపేట, బాలమ్‌రాయ్, రసూల్‌పురాకు చెందిన పసుపుల కల్పన అలియాస్ మల్లమ్మ హౌస్‌కీపింగ్ పనిచేస్తోంది. ఈ మెగత కొంత కాలం నుంచి […] The post మహిళా దొంగ మల్లమ్మ మళ్లీ అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : ఇళ్లల్లో దొంగతనాలు చేస్తున్న మహిళను నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితురాలి వద్ద నుంచి 135.2 గ్రాముల బంగారు ఆభరణాలు, 50 గ్రాముల వెండి వస్తువులు, లేడీస్ వాచ్‌లు 7 స్వాధీనం చేసుకున్న మొత్తం వస్తువుల విలువ రూ. 4,70,000 ఉంటుంది. పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్, బేగంపేట, బాలమ్‌రాయ్, రసూల్‌పురాకు చెందిన పసుపుల కల్పన అలియాస్ మల్లమ్మ హౌస్‌కీపింగ్ పనిచేస్తోంది. ఈ మెగత కొంత కాలం నుంచి తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు చేస్తోంది.

ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో చోరీలు చేయడంతో పోలీసులు ఇప్పటి వరకు 13సార్లు అరెస్టు చేశారు. చోరీలకు అలవాటు పడిన మల్లమ్మ నగరంలో ఒక ప్రాంతంలో ఎక్కువ రోజులు ఉండకుండా తరచూ ఇంటిని మార్చేది. ఎక్కడికి వెళ్లిన సమీపంలోని ఇళ్లల్లో దొంగతనాలు చేసేది. సికింద్రాబాద్, ఆదయ్య నగర్‌కు చెందిన సీతాల మనోజ్‌కుమార్ శైలజా ఇంట్లో ఈ నెల 19వ తేదీన చోరీ జరగడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుర్తుతెలియని వారు తన ఇంటి తాళంను పగుల గొట్టి చోరీ చేశారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఆదయ్య నగర్‌లోని తాళం వేసిన ఇంటిలో కూడా చోరీ చేయడంతో నిందితురాలిని అరెస్టు చేశారు. సిసిటివి ఫుటేజ్ సాయంతో నిందితురాలిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

2008లో మొదలు పెట్టింది…
కల్పన అలియాస్ మల్లమ్మ చిన్నప్పటి నుంచి హౌస్‌కీపింగ్ చేస్తోంది. ఈ క్రమంలో ఇళ్లల్లో 2008 నుంచి దొంగతనాలు చేయడం ప్రారంభించింది. పలుమార్లు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించినా బయటికి వచ్చిన తర్వాత ఎలాంటి మార్పురాలేదు. పోలీసులు తనను గుర్తించకుండా ఉండేందుకు తరచూ ఇళ్లు మార్చేది. మల్లమ్మపై బేగంపేట పోలీస్ స్టేషన్‌లో 6, కుషాయిగూడలో 2, నాచారం పిఎస్‌లో 5 కేసులు నమోదయ్యాయి. మధ్యతరగతి వారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా తిరిగేది, చేతిలో కట్టింగ్ ప్లేయర్, స్క్రూ డ్రైవర్‌తో ఇంటి తాళాలను పగుల గొట్టి బంగారు, వెండి ఆభరణాలు, నగదు చోరీ చేసేది. టాస్క్‌ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావు పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ నాగేశ్వర్ రావు, ఎస్సైలు రవి, శ్రీకాంత్, పరమేశ్వర్, రాజశేఖర్ రెడ్డి తదితరులు కేసు దర్యాప్తు చేశారు.

Woman arrested for Theft

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మహిళా దొంగ మల్లమ్మ మళ్లీ అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: