మల్కాజిగిరిలో కోరలు చాచిన డెంగీ

  మౌలాలి : మల్కాజిగిరి సర్కిల్ గౌతంనగర్ డివిజన్ పరిధిలో విష జ్వరాలు ఇటీవల పెరగుతున్నాయి. ఏ ఆసుపత్రిని చూసినా, అక్కడ ఎవరిని మాట్లాడించినా అన్నా జ్వరం వస్తుందన్నా తగ్గడం లేదు.. నాకే కాదు నిన్న, మొన్న మా ఇంటిల్లి పాది అందరు జ్వరాల బారిన పడ్డారు. ఒకరు పైలేరియా అంటే… మరొరకరు డెంగీ వచ్చిందంటూ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నామంటూ వాటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వాతావరణ మార్పులతో ఇటీవల వరుసగా వర్షాలు కురుస్తుండటంతో పాటు జిహెచ్‌ఎంసి […] The post మల్కాజిగిరిలో కోరలు చాచిన డెంగీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మౌలాలి : మల్కాజిగిరి సర్కిల్ గౌతంనగర్ డివిజన్ పరిధిలో విష జ్వరాలు ఇటీవల పెరగుతున్నాయి. ఏ ఆసుపత్రిని చూసినా, అక్కడ ఎవరిని మాట్లాడించినా అన్నా జ్వరం వస్తుందన్నా తగ్గడం లేదు.. నాకే కాదు నిన్న, మొన్న మా ఇంటిల్లి పాది అందరు జ్వరాల బారిన పడ్డారు. ఒకరు పైలేరియా అంటే… మరొరకరు డెంగీ వచ్చిందంటూ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నామంటూ వాటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

వాతావరణ మార్పులతో ఇటీవల వరుసగా వర్షాలు కురుస్తుండటంతో పాటు జిహెచ్‌ఎంసి అధికారులు, ఎంటమాలజీ సిబ్బంది, పీహెచ్‌సీ వైద్య అధికారులు, సిబ్బంది నామమాత్రంగా దోమల నివారణ చర్యలు చేపడుతున్నారన్న విమర్శలు స్ధానికంగా వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా దోమల కాటు వల్లనే విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నా, నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారన్న ఆరోపణలు వినపడుతున్నాయి.

ముఖ్యంగా ఖాళీ స్ధలాలలో చెత్తా చెదారం పేరుకు పోవడం, కాలనీలు, బస్తీలలో అంతర్గత రహదారుల్లో నాలాలా నుండి తీసి అక్కడే చెత్త కుప్పలను పడేయడం, వాటిని వెంటనే తొలగించక పోవడం, పిచ్చి మొక్కలను తొలగించక పోవడం, దోమల నివారణకు క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయక పోవడం, నీటి నిల్వ ఉన్న ప్రాంతాలలో దోమలు వృద్ధి చెందకుండా దోమల మందు పిచికారి చేయక పోవడం తదితర కారణాల వల్ల మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో దోమల బెడద పెరుగుతుందే కాని, తగ్గిన దాఖలాలు కాన రావడం లేదు.

దోమల కాటుకు గురైన చిన్నారులు, వృద్ధులకు రోగ నిరోధక శక్తి తగినంత లేక పోవడం కారణంతో డెంగీ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే మల్కాజిగిరి, నేరేడ్‌మెట్, మౌలాలి తదితర ప్రాంతాలలో డెంగీ బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకొని ప్రాణాలతో బయట పడిన వారు అనేక మంది ఉంటుండగా, చికిత్స పొంది మరణించిన వారి వివరాలు బయటకు పొక్కకుండా వైద్యులు జాగ్రత్త పడుతున్నారని విమర్శలు వినపడుతున్నాయి.

చిన్నారులను చిదిమేస్తున్న డెంగీ
ఇటీవల వరుసగా డెంగీ వ్యాధితో చిన్నారులు మృత్యువాత పడుతుండటంతో స్ధానికంగా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. రెండు రోజుల క్రితం ఇదే మల్లికార్జున్‌నగర్‌లో గ్రీష్మా అనే ఆరేళ్ల చిన్నారి డెంగీ బారిన పడి మృతి చెందింది. శనివారం సాయంత్రం నేరేడ్‌మెట్ కాకతీయనగర్‌కు చెందిన ఓ ఉపాధ్యాయుడు కుమార్తె (20) డెంగీ ప్రాణాలను హరించింది. వరుసగా వెలుగులోకి వస్తున్న ఈ సంఘటనలు ఇంకా మరువకే ముందే ఆదివారం మల్లికార్జున్‌నగర్‌లో డెంగీ వ్యాధి మరో చిన్నారిని బలిగొనడం స్ధానికంగా కలకలం రేపుతోంది.

వివరాలిలా ఉన్నాయి. స్ధానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… గౌతంనగర్ డివిజన్ పరిధిలోని మల్లికార్జున్‌నగర్‌కు చెందిన ఏ. భిక్షపతి, ఏ. శశిరేఖల కుమార్తె తన్వీ (3) స్ధానికంగా ఉండే సెవెన్ హిల్స్ హై స్కూల్ లో ఎల్‌కెజీ చదువుతోంది. గత మూడు రోజుల క్రితం జ్వరం రావడంతో అస్వస్ధతకు గురైన ఆమె కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించారు. జ్వరం తగ్గక పోవడంతో గాంధీ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 6గంటలకు మృతి చెందినదని తల్లిదండ్రులు విలపించారు.

3years girl died with Dengue

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మల్కాజిగిరిలో కోరలు చాచిన డెంగీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: