హుక్కా మాటున ‘ఇ’సిగరెట్ మిషన్లు అమ్మకం

హైదరాబాద్: నిషేధిత ఈ సిగరేట్ల మిషన్లు విక్రయిస్తున్న నిందితుడిని సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 35 ఈ సిగరేట్ మిషన్లు, 68 ఫ్లేవర్స్ లిక్విడ్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. నగరంలోని షాలిబండకు చెందిన సయిద్ నూర్ ఆరీఫ్ అలీ అబిడ్స్‌లోని మోజంజాహీ మార్కెట్‌లో గుల్‌నార్ పర్‌ఫ్యూమ్ వ్యాపారం చేస్తున్నాడు. పర్‌ఫ్యూమ్ పేరుతో నిషేధిత టోబాకో, ఎలక్ట్రానిక్ సిగరేట్లు, వాటిలో ప్రోపైలేన్, గ్లైకోల్, గ్లిసరిన్,వాటర్, […] The post హుక్కా మాటున ‘ఇ’ సిగరెట్ మిషన్లు అమ్మకం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: నిషేధిత ఈ సిగరేట్ల మిషన్లు విక్రయిస్తున్న నిందితుడిని సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 35 ఈ సిగరేట్ మిషన్లు, 68 ఫ్లేవర్స్ లిక్విడ్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. నగరంలోని షాలిబండకు చెందిన సయిద్ నూర్ ఆరీఫ్ అలీ అబిడ్స్‌లోని మోజంజాహీ మార్కెట్‌లో గుల్‌నార్ పర్‌ఫ్యూమ్ వ్యాపారం చేస్తున్నాడు. పర్‌ఫ్యూమ్ పేరుతో నిషేధిత టోబాకో, ఎలక్ట్రానిక్ సిగరేట్లు, వాటిలో ప్రోపైలేన్, గ్లైకోల్, గ్లిసరిన్,వాటర్, నికోటిన్ ఫ్లేవర్లను కలిపి విక్రయిస్తున్నాడు.

అవసరం ఉన్న వారికి విక్రయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సిగరేట్ల తయారీ విక్రయాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సిగట్లు, హీట్ నాట్ బర్న్ డివైస్, వ్యాప్, ఈ షీషా, ఈ నికోటిన్ ఫ్లేవర్ హుక్కాపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటి వల్ల యువత వ్యసనాల భారిన పడుతోందని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కేమార్కెట్‌లో ఈ సిగరేట్లకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో విక్రయిస్తూ సులభంగా డబ్బులు సంపాదిస్తున్నాడు. వీటిని ఫుడ్ రూపంలో తీసుకోవడం కూడా నిషేధించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు కోసం అబిడ్స్ పోలీసులకు అప్పగించారు. టాస్క్‌ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావు పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ సాయిని శ్రీనివాస్ రావు, ఎస్సై శ్రీనివాసులు, శ్రీధర్, సిబ్బంది నిందితుడిని అరెస్టు చేశారు.

 

E Cigarettes seized in Shalibanda Hyderabad

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post హుక్కా మాటున ‘ఇ’ సిగరెట్ మిషన్లు అమ్మకం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: