ఆదిలాబాద్ లో ప్రేమజంట ఆత్మహత్య

  ఆదిలాబాద్: జిల్లాలో ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. పెద్దలు తమ పెళ్లి అంగీకరిస్తారో లేదో అని ఓ ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్లితే… జిల్లాలోని జూలూరుపాడు మండలం, అన్నారుపాడు గ్రామానికి చెందిన గుగులోత్ గోపి(24), లావుడ్యా సింధు(22) గత కోన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. గోపి అన్న, సింధు అక్క ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే సింధుల కుటుంబ సభ్యులు ఒకే ఇంటి నుంచి ఇంకొ అల్లుడు, కొడలు వద్దని […] The post ఆదిలాబాద్ లో ప్రేమజంట ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆదిలాబాద్: జిల్లాలో ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. పెద్దలు తమ పెళ్లి అంగీకరిస్తారో లేదో అని ఓ ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్లితే… జిల్లాలోని జూలూరుపాడు మండలం, అన్నారుపాడు గ్రామానికి చెందిన గుగులోత్ గోపి(24), లావుడ్యా సింధు(22) గత కోన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. గోపి అన్న, సింధు అక్క ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే సింధుల కుటుంబ సభ్యులు ఒకే ఇంటి నుంచి ఇంకొ అల్లుడు, కొడలు వద్దని ఇరువురి కుటుంబ సభ్యులు చెప్పారు. వీరి ప్రేమ వ్యవహరం ఇరువురి కుటుంబాల్లో తెలియడంతో పెళ్లి అంగీకరించారు. అయితే

గోపీ, సింధులకు మాత్రం పెద్దల నిర్ణయంపై నమ్మకం లేదని, ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడారు. గోపి ఆత్మహత్యకు ముందు తమకు ఫోన్ చేసి విషయం చెప్పినట్టు గోపి కుటుంబ సభ్యులు తెలిపారు. వేంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. తమ పెళ్లికి ఒప్పుకుంటారో ఒప్పుకోరో అన్న అనుమానంతోనే వీరు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు వెల్లడించారు.

Love Couple Commits suicide in Adilabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆదిలాబాద్ లో ప్రేమజంట ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: