సితారపై మ‌హేష్ బాబు ఎమోషనల్ ట్వీట్..

  సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు డాటర్స్ డే సందర్భంగా తన కూతురు సితారపై ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘నా బుజ్జి సితా పాపా నీకు ‘డాటర్స్‌ డే’ శుభాకాంక్షలు. నువ్వు చాలా అద్భుతమైన, ప్రియమైన, అల్లరి కుతూరివి. నిన్ను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటాను. జీవితంలో అత్యంత ఎత్తుకి ఎద‌గాలని మ‌నస్పూర్తిగా కోరుకుంటున్నా’ అని మహేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన కూతురు సితారతో దిగిన ఫోటోలన్నీ కలిపి వీడియో రూపంలో పోస్టు […] The post సితారపై మ‌హేష్ బాబు ఎమోషనల్ ట్వీట్.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు డాటర్స్ డే సందర్భంగా తన కూతురు సితారపై ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘నా బుజ్జి సితా పాపా నీకు ‘డాటర్స్‌ డే’ శుభాకాంక్షలు. నువ్వు చాలా అద్భుతమైన, ప్రియమైన, అల్లరి కుతూరివి. నిన్ను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటాను. జీవితంలో అత్యంత ఎత్తుకి ఎద‌గాలని మ‌నస్పూర్తిగా కోరుకుంటున్నా’ అని మహేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన కూతురు సితారతో దిగిన ఫోటోలన్నీ కలిపి వీడియో రూపంలో పోస్టు చేశాడు. ఇక, మహేష్ సతీమణి నమ్రత కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సితారకు డాటర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఆమె కూడా ఓ స్పెషల్‌ వీడియోను షేర్‌ చేస్తూ..  ‘నా జీవితంలో వెలుగు దివ్వెవు నువ్వు. నా ఆకాశంలో ప్రతిక్షణం మెరుస్తుండే చిన్ని తారవు నువ్వు. నా ప్రపంచాన్ని ఎంతో ఆనందంగా మార్చావు. లవ్‌ యూ సితార.’ అని నమ్రతా ట్వీట్ చేశారు.

కాగా, సితార డ్యాన్స్‌కి సంబంధించిన ప‌లు వీడియోల‌ని ఈ జంట సామాజిక మాధ్య‌మాల‌లో షేర్ చేస్తూ అభిమానులతో తమ  ఆనందాన్ని పంచుకుంటుంటారు. ప్ర‌స్తుతం మహేష్ బాబు, యంగ్ డైరెక్టర్ అనిల్ రావూపుడి దర్శకత్వంలో స‌రిలేరు నీకెవ్వ‌రు  సినిమా చేస్తున్నాడు. ఇందులో మహేష్ సరసన యంగ్ బ్యూటీ రష్మిక మందన నటిసస్తుంది.2020 సంక్రాంతి కానుక‌గా ఈ మూవీ రిలీజ్ కానుంది.

 

Mahesh Babu says daughters day wishes to Sitara

The post సితారపై మ‌హేష్ బాబు ఎమోషనల్ ట్వీట్.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: