ఒక పంటతోనే కాళేశ్వరం ఖర్చు తీరుతుంది: కెసిఆర్

  హైదరాబాద్: వాస్తవంగా తాము పెట్టిన బడ్జెట్ లక్షా 36 వేల కోట్లు అని సిఎం కెసిఆర్ తెలిపారు. ద్రవ్య వినిమయ బిల్లుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శాసన సభలో సమాధానం ఇచ్చారు. మిగతా 10 వేల కోట్లు హైదరాబాద్‌లోని భూముల అమ్మక ద్వారా వచ్చేదని స్పష్టం చేశారు. దేశంలో ఆర్థిక మాంద్యం ఉందని, ఆర్థిక మాంద్యం ఉన్నా సంక్షేమ పథకాలు ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జూరాలలో వాడుకునే నీరు కేవలం ఆరు టిఎంసిలు […] The post ఒక పంటతోనే కాళేశ్వరం ఖర్చు తీరుతుంది: కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: వాస్తవంగా తాము పెట్టిన బడ్జెట్ లక్షా 36 వేల కోట్లు అని సిఎం కెసిఆర్ తెలిపారు. ద్రవ్య వినిమయ బిల్లుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శాసన సభలో సమాధానం ఇచ్చారు. మిగతా 10 వేల కోట్లు హైదరాబాద్‌లోని భూముల అమ్మక ద్వారా వచ్చేదని స్పష్టం చేశారు. దేశంలో ఆర్థిక మాంద్యం ఉందని, ఆర్థిక మాంద్యం ఉన్నా సంక్షేమ పథకాలు ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జూరాలలో వాడుకునే నీరు కేవలం ఆరు టిఎంసిలు మాత్రమేనని, నీటి లభ్యత లేని దగ్గర రోజుకు రెండు టిఎంసిలు ఎత్తిపోసే ప్రజెక్టు చేపడుతారా అని ప్రశ్నించారు. తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదని సిడబ్ల్యుసి చెప్పిందని, ప్రత్యామ్నాయం మేడిగడ్డ ఒక్కటే అని సిడబ్ల్యుసి తేల్చి చెప్పిందన్నారు. అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటున్నారో అన్న సోయి కూడా లేదని ప్రతిపక్షాలపై కెసిఆర్ మండిపడ్డారు. నాగార్జున సాగర్, ఎస్‌ఆర్‌ఎస్‌పి కూడా అడ్డగోలు డిజైనేనా? అని కాంగ్రెసోళ్లను నిలదీశారు.

ఈ రెండు ప్రాజెక్టుల మీద గత ప్రభుత్వాలు అప్పులు తేలేదా? అని అడిగారు. కాంగ్రెస్ హయాంలో అప్పు లేకుండా కట్టిన ప్రాజెక్టు ఒక్కటైనా ఉందా? , 40 ఏళ్లైనా ఎస్‌ఎల్‌బిసి ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఢిల్లీ నాయకత్వానికి తలవొంచి నందికొండను నాశనం చేసింది కాంగ్రెసోళ్లు కాదా? ధ్వజమెత్తారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత కాళేశ్వరం కట్టి చూపించామని, 45 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చి తీరుతామని, ఒక పంటతో కాళేశ్వరంపై పెట్టి ఖర్చు తీరుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలించి ఆరు చందమామలు ఏడు సూర్యూళ్లను పెడితే తాము ఖరాబ్ చేసినమాని, 54 ఏళ్ల కాంగ్రెస్ పాలనతో దేశ ఆర్థిక పరిస్థితి చతికిల పడిందని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పథకాలు పేర్లు మారినయి తప్ప ప్రజల తలరాత మారలేదని, దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తీసుకొచ్చిన గరీబీ హఠావో, పిఎం నరేంద్ర మోడీ తెచ్చిన బేటీ బచావో… హఠావో.. బచావో తప్ప దేశంలో మరొకటి లేదా అని దుయ్యబట్టారు. దేశంలో ఉన్న ఈ దుస్థితికి ఎవరి విధానాలు కారణమన్నారు. మన పక్కన ఉన్న చైనా ఎక్కడిదాకా పోయిందని, మనం ఎక్కడ ఉన్నామని ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. గుండెల మీద అణుబాంబు వేసుకున్న నాగసాకి ఎక్కడిదాకా పోయిందన్నారు. తాను లేకపోతే తాను జెండా ఎగరేయకపోతే కాంగ్రెస్, బిజెపిల చరిత ఎవరు చెప్పేవారు కాదని కెసిఆర్ తెలిపారు.

 

CM KCR Speech Today Assembly

The post ఒక పంటతోనే కాళేశ్వరం ఖర్చు తీరుతుంది: కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: