విమానంలో కుదుపులు…ప్రయాణికులకు గాయాలు

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాకు చెందిన ఎఐ-467 విమానం ఒక్కసారిగా కుదుపులకు గురైంది. దీంతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానం సేఫ్ గా ల్యాండ్ అయ్యింది.  ఈ ఘటన సెప్టెంబర్ 17న ఢిల్లీ నుంచీ విజయవాడకు బయల్దేరిన విమానంలో చేటుచేసుకుంది. దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి విజయవాడకు వెళ్తున్న విమానంపై ఉరుములు, మెరుపులూ ఎటాక్ చేశాయి. దీంతో విమానం కుదుపులకు గురికావడంతో అందులోని వస్తువులు […] The post విమానంలో కుదుపులు… ప్రయాణికులకు గాయాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాకు చెందిన ఎఐ-467 విమానం ఒక్కసారిగా కుదుపులకు గురైంది. దీంతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానం సేఫ్ గా ల్యాండ్ అయ్యింది.  ఈ ఘటన సెప్టెంబర్ 17న ఢిల్లీ నుంచీ విజయవాడకు బయల్దేరిన విమానంలో చేటుచేసుకుంది. దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి విజయవాడకు వెళ్తున్న విమానంపై ఉరుములు, మెరుపులూ ఎటాక్ చేశాయి. దీంతో విమానం కుదుపులకు గురికావడంతో అందులోని వస్తువులు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. ప్రయాణికులు తినే ఆహార ప్లేట్లు, బాటిళ్లు.. విమాన సీట్ల కింద, ఫ్లోర్ పైనా ఎక్కడ బడితే అక్కడ ఎగిరిపడ్డాయి. విమానంలో టాయిలెట్ మూత ఊడిపోయింది. కొందరు ప్రయాణికులకు, విమాన సిబ్బందికి గాయాలు కూడా అయ్యాయి. ఏం జరుగుతోందని టెన్షన్‌తో ప్రయాణికులు క్షణక్షణం నరకం చూశారు. ఎట్టకేలకు విమానం కూల్‌గా రన్ వేపై దిగడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన ప్రయాణికులు, సిబ్బందికి డాక్టర్లు ట్రీట్‌మెంట్ చేశారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా మేనేజ్‌మెంట్ దర్యాప్తుకు ఆదేశించింది.

Air India flight faced thunderstorm, passengers bruised

The post విమానంలో కుదుపులు… ప్రయాణికులకు గాయాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: