ఇస్రో తదుపరి లక్ష్యం గగన్‌యాన్

  2021 డిసెంబర్ నాటికి అంతరిక్షంలోకి మానవసహిత యాత్ర చంద్రయాన్2 98శాతం విజయవంతమైంది ఆర్బిటర్ అద్భుతంగా పనిచేస్తోంది ల్యాండర్ విక్రమ్ వైఫల్యంపై విశ్లేషణ ఇస్రో ఛైర్మన్ కె. శివన్ వెల్లడి భువనేశ్వర్ : ఇస్రో తరువాతి లక్షం గగన్‌యాన్ అని, 2021 డిసెంబర్ నాటికి అంతరిక్షం లోకి మానవులను పంపడమే ప్రధాన లక్షంగా దేశం ముందుకు సాగుతోందని ఇస్రో చైర్మన్ కె. శివన్ శనివారం ఐఐటి భువనేశ్వర్ ఎనిమిదో స్నాతకోత్సవంలో పాల్గొనడానికి వెళ్లే ముందు ఇక్కడి విమానాశ్రయంలోని […] The post ఇస్రో తదుపరి లక్ష్యం గగన్‌యాన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

2021 డిసెంబర్ నాటికి అంతరిక్షంలోకి మానవసహిత యాత్ర
చంద్రయాన్2 98శాతం విజయవంతమైంది
ఆర్బిటర్ అద్భుతంగా పనిచేస్తోంది
ల్యాండర్ విక్రమ్ వైఫల్యంపై విశ్లేషణ
ఇస్రో ఛైర్మన్ కె. శివన్ వెల్లడి

భువనేశ్వర్ : ఇస్రో తరువాతి లక్షం గగన్‌యాన్ అని, 2021 డిసెంబర్ నాటికి అంతరిక్షం లోకి మానవులను పంపడమే ప్రధాన లక్షంగా దేశం ముందుకు సాగుతోందని ఇస్రో చైర్మన్ కె. శివన్ శనివారం ఐఐటి భువనేశ్వర్ ఎనిమిదో స్నాతకోత్సవంలో పాల్గొనడానికి వెళ్లే ముందు ఇక్కడి విమానాశ్రయంలోని విలేకరులతో ఆయన మాట్లాడారు. భవిష్యత్ ప్రణాళిక గురించి చర్చిస్తున్నామని, ఇంకా తుది నిర్ణయం కాలేదని ఆయన అన్నారు. వచ్చే సంవత్సరానికి మానవ రహిత చంద్రయాత్రను సాధించడానికే ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. 2020 డిసెంబర్ నాటికి తొలి మానవ రహిత వ్యోమనౌక ప్రయోగించడమవుతుందని, 2021 జులై నాటికి రెండో మానవ రహిత వ్యోమనౌక వెళ్తుందని చెప్పారు. 98 శాతం వరకు చంద్రయాన్ 2 తన లక్షాలను సాధించిందని, శాస్త్రవేత్తలు ఎంతో ప్రయత్నాలు చేసినా ల్యాండర్ విక్రమ్‌తో కమ్యూనికేషన్లు పునరుద్ధరణ కాలేదని, ల్యాండర్‌లో ఏం జరిగిందో మొదట తెలుసుకోవలసిన అవసరం ఉందని శివన్ చెప్పా రు.

ఆర్బిటర్ బాగా పనిచేస్తోందని, అందులోని ఎనిమిది సైన్సు పరికరాలు విడివిడిగా వాటికి నిర్దేశించిన లక్షాలను చక్కగా నెరవేర్చ గలుగుతున్నాయని తెలిపారు. ఆర్బిటర్‌ను ఏడాది వరకే పనిచేసేలా రూపొందించినప్పటికీ మరో ఏడున్నర సంవత్సరాల పాటు డేటా అందించే అవకాశం ఉందని వివరించారు. రెండు అంశాల్లో చంద్రయాన్ 2 మిషన్ 98 శాతం విజయం సాధించిందని చెప్పవచ్చని, ఒకటి సైన్సు పరంగా రెండోది సాంకేతికత పరంగా ఈ విజయం సాధించిట్టు విశ్లేషించారు. సాంకేతిక పరంగా విజయం సంపూర్తిగా సాధించడమైందని చెప్పారు. ఇస్రో నిపుణులు,విద్యావేత్తలతో కూడిన జాతీయ స్థాయి కమిటీ విక్రమ్‌తో కమ్యూనికేషన్ లోపించడంపై కారణాలను విశ్లేషిస్తోందని, ఏదైనా డేటా లభించిన వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవడమవుతుందని శివన్ పేర్కొన్నారు.

Chandrayaan-2 98% Successful, Next Is Gaganyaan

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇస్రో తదుపరి లక్ష్యం గగన్‌యాన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: