నేడే హౌడీ మోడీ షో

  హూస్టన్‌లోని ఎన్‌ఆర్‌జి స్టేడియంలో భారీగా ఏర్పాట్లు మోడీతో పాటు హాజరుకానున్న ట్రంప్ పెద్ద ఎత్తున కార్ల ర్యాలీలు తరలివస్తున్న 50 వేల మంది హూస్టన్ : భారత ప్రధాని మోడీని భారతీయ సంతతి అమెరికన్లు కుశలమడిగే హౌడీ మోడీకి వేళయింది. ఆదివారం అమెరికాలోని హూస్టన్‌లో ప్రధాని మోడీకి ఇండో అమెరికన్లు స్వాగతం పలికేందుకు సిద్ధం అయ్యారు ఇక్కడి సువిశాలమైన ఎన్‌ఆర్‌జి ఫుట్‌బాల్ స్టేడియంలో 50 వేల మంది ప్రేక్షకులు హాజరు కానున్నారు. పోప్‌ను మినహాయిస్తే ఒక్క […] The post నేడే హౌడీ మోడీ షో appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హూస్టన్‌లోని ఎన్‌ఆర్‌జి స్టేడియంలో భారీగా ఏర్పాట్లు
మోడీతో పాటు హాజరుకానున్న ట్రంప్
పెద్ద ఎత్తున కార్ల ర్యాలీలు
తరలివస్తున్న 50 వేల మంది

హూస్టన్ : భారత ప్రధాని మోడీని భారతీయ సంతతి అమెరికన్లు కుశలమడిగే హౌడీ మోడీకి వేళయింది. ఆదివారం అమెరికాలోని హూస్టన్‌లో ప్రధాని మోడీకి ఇండో అమెరికన్లు స్వాగతం పలికేందుకు సిద్ధం అయ్యారు ఇక్కడి సువిశాలమైన ఎన్‌ఆర్‌జి ఫుట్‌బాల్ స్టేడియంలో 50 వేల మంది ప్రేక్షకులు హాజరు కానున్నారు. పోప్‌ను మినహాయిస్తే ఒక్క విదేశీ నేతకు ఇంత మంది తరలిరావడం ఇదే తొలిసారి. మోడీ హౌడూయూ డూ అనేది రిథిమిక్‌గా హౌడీ మోడీగా రూపుదిద్దుకుని పలు కళా ప్రదర్శనల నడుమ అమెరికా అధ్యక్షులు ట్రంప్ కూడా వచ్చే వేడుకగా ఉత్సవంగా సాగుతుంది. ఆదివారం వారాంతపు వేళలో జరిగే ఈ కార్యక్రమంపట్ల అమెరికాలో విశే ష ఆసక్తి నెలకొంది.

ఈ కార్యక్రమం ఒక సామాజిక సమూహ కార్యక్రమం అని, 600కు పైగా సంస్థల నుం చి అందిన విరాళాలు సాయంతో చేపట్టిన మెగా ఈవెంట్ అని నిర్వాహకులు తెలిపారు. ఆదివారం ఉదయం ఆరుగంటలకు స్టేడియం గేట్లు తెరుస్తారు. లోపల 50వేల మందిని 8 గంటల లోపున అనుమతిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు పదిన్నర వరకూ సాగుతాయి. కార్యక్రమాల ప్రత్యక్ష వ్యాఖ్యానం ఇంగ్లీషు హిందీ, స్పానిష్‌లలో ఉంటుంది. మధ్యాహ్నం 12.30కు ఈవెంట్ ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు. అమెరికాలో అత్యంత భారీ స్థాయి షోలు బియోన్స్, మెటాలికా, యు2లకు వేదిక అయిన చోటనే ఇప్పుడు మోడీ కార్యక్రమం ఏర్పాటు అయింది. భారత అంబాసిడర్ హర్ష్ వి శృంగ్లాతో కూడిన బృందం ఇక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించింది. 1600 మందికి పైగా వాలంటీర్లు చాలా రోజులుగా ఇక్కడ నిరంతరం ఏర్పాట్లను చేస్తూ వస్తున్నారు.

విశేషాలు అనేకం
శుక్రవారం ఎన్‌ఆర్‌జి స్టేడియంలో కారు ర్యాలీ నిర్వహించారు. ఇందులోమొత్తం 200 కార్లు పాల్గొన్నాయి. హౌడీ మోడీకి ప్రచార ఘట్టంగా దీనిని ఏర్పాటు చేశారు. భారత్, అమెరికా జెండాలతో ఈ కారు ర్యాలీ సాగింది. ఉభయదేశాల సంబంధాలను తెలియచేసింది. వాలంటీర్లు, నిర్వాహకులు నమో అగైన్ టీ షర్టులతో ఈ నినాదాలతోనే మోడీకి స్వాగతం పలుకుతారు. ఆదివారం నాటి కార్యక్రమ వివరాలను టెక్సాస్ ఇండియా ఫోరం (టిఐఎఫ్) ప్రతినిధులు ప్రీతి దావ్రా, గితేష్ దేశాయ్, రిషి భుటాడాలు మీడియాకు తెలిపారు.

అమెరికాతో ఇండియా సంబంధాలు, ఈ దిశలో ఇక ముందు చేపట్టే కార్యక్రమాలు, అమెరికాలోని భారతీయ సంతతి అమెరికా జాతీయ జనస్రవంతిలో వహిస్తున్న కీలక పాత్ర వంటి అంశాలను ప్రధాని మోడీ ప్రస్తావిస్తారని నిర్వాహకులు తెలిపారు. రెండోసారి ప్రధాని అయిన తరువాత ఇక్కడ ఇండో అమెరికన్ల సమక్షంలోకి ప్రధాని మోడీ రావడం ఇదే తొలిసారి అని, ఈ కోణంలో దీనికి మరింత ప్రాధాన్యత ఉందని నిర్వాహకులు వెల్లడించారు. ఇక భారతీయ సంతతి వారు నిర్వహించే ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షులు ట్రంప్ తరలిరావడం మరో కీలక అంశం అని, భారతీయ కార్యక్రమానికి అమెరికా అధినేత తరలిరావడం అసాధారణం, ఇప్పుడు ట్రంప్ రావడంతో ఇది ప్రత్యేకతగా మారిందని ప్రీతి తెలిపారు.

ఈ కార్యక్రమ నిర్వాహణ ద్వారా మొత్తం యుఎస్ ఇండియాను టెక్సాస్‌ను మరింత చేరువ చేయడానికి వీలేర్పడుతుందని, ఈ అవకాశం తమ సంస్థకు దక్కడం ఆనందంగా ఉందని టిఐఎఫ్ తెలిపింది. హౌడీ మోడీ సంస్కృతుల సమ్మేళన కార్యక్రమం అని, ఇండియా అమెరికా వ్యాపారంలో పదిశాతం టెక్సాస్‌లో జరుగుతుందని, టెక్సాస్ ఇండియా మధ్య 700 కోట్ల డాలర్ల మేర అమెరికా సరుకులు, ఉత్పత్తులు రవాణా అవుతుంటాయి. భారతదేశానికి చెందిన ప్రముఖ కంపెనీలు ఎక్కువగా టెక్సాస్‌లోనే తమ కార్యాలయాలను తెరిచాయి. దీనితో ఆ ప్రాంతపు ఇండో అమెరికన్లతో పాటు, అమెరికన్లకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి.

Indian-Americans all set to welcome PM Modi for Howdy

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నేడే హౌడీ మోడీ షో appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: