నమూనా మారింది

  దేశం తెలంగాణ వైపు చూస్తోంది బెంగాల్, గుజరాత్ నమూనాలు నిన్నటి మాట, మన రాష్ట్రంలో అమలు చేసిన రైతుబంధును ఒడిశా, జార్ఖండ్, బెంగాల్, ఎపిలు అనుకరించాయి. కేంద్రం పిఎం కిసాన్ యోజన పేరుతో అమలు చేస్తోంది త్వరలోనే సమాచార కమిషనర్లు – అసెంబ్లీలో మంత్రి కెటిఆర్ హైదరాబాద్ : దేశంలో ఒకప్పుడు బెంగాల్ నమూనా, గుజరాత్ నమూనా అనేవారని, కానీ ఇప్పుడు దేశం మొ త్తం తెలంగాణ వైపు చూస్తోందని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి […] The post నమూనా మారింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

దేశం తెలంగాణ వైపు చూస్తోంది

బెంగాల్, గుజరాత్ నమూనాలు నిన్నటి మాట, మన రాష్ట్రంలో అమలు చేసిన రైతుబంధును ఒడిశా, జార్ఖండ్, బెంగాల్, ఎపిలు అనుకరించాయి. కేంద్రం పిఎం కిసాన్ యోజన పేరుతో అమలు చేస్తోంది

త్వరలోనే సమాచార కమిషనర్లు
– అసెంబ్లీలో మంత్రి కెటిఆర్

హైదరాబాద్ : దేశంలో ఒకప్పుడు బెంగాల్ నమూనా, గుజరాత్ నమూనా అనేవారని, కానీ ఇప్పుడు దేశం మొ త్తం తెలంగాణ వైపు చూస్తోందని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు అన్నారు. రైతుబంధు పథకాన్ని ఒరిస్సా, ఝార్ఖండ్, బెంగాల్, ఎపితో పాటు పిఎం కిసాన్ యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తోందని తెలిపారు. శనివారం అసె ంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడారు. కొత్త రాష్ట్రం ఎంత వేగంగా పురోగతి సాధిస్తుందో తెలియజేయడానికి రైతుబంధు పథకాన్ని అన్ని భాషలలో పత్రికా ప్రకటనలు ఇచ్చామని చెప్పారు.

తెలంగాణ ఔన్నత్యాన్ని నిలబెట్టేలా ప్రభుత్వం చేసిన మంచి పనులను గొంతెత్తి చాటుతామన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసింది కాబట్టే ప్రజలు తమకు ఓట్లేసి గెలిపించారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో త్వరలోనే సమాచార కమిషనర్ల నియామకం చేపడతామని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. ఆర్‌టిఐ చట్టం కింద నెలకు సుమారు 500 దరఖాస్తులు వస్తున్నాయని, వెంటనే వాటికి సంబంధించిన సమాచారం అందజేస్తున్నామని తెలిపారు. ఎక్కడా సమాచార లోపం లేదని పేర్కొన్నారు.

Country is Looking Towards Telangana

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నమూనా మారింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: