హుజూర్‌నగర్ వార్

  నోటిఫికేషన్ సెప్టెంబర్ 23 30వరకు నామినేషన్లు స్క్రూటినీ : అక్టోబర్ 01 ఉపసంహరణ : అక్టోబర్ 03 అక్టోబర్ 21 హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక సూర్యాపేట జిల్లాలో కోడ్ మొదలు ఫలితాలు అక్టోబర్ 24 హుజూర్‌నగర్‌కు ఉప ఎన్నిక హైదరాబాద్ : రాష్ట్రంలోని హుజుర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. హర్యానా, మహారాష్ట్రలకు సాధారణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాలో ఖాళీలు ఏర్పడిన […] The post హుజూర్‌నగర్ వార్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నోటిఫికేషన్

సెప్టెంబర్ 23

30వరకు నామినేషన్లు స్క్రూటినీ : అక్టోబర్ 01 ఉపసంహరణ : అక్టోబర్ 03

అక్టోబర్ 21

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక
సూర్యాపేట జిల్లాలో కోడ్ మొదలు

ఫలితాలు అక్టోబర్ 24

హుజూర్‌నగర్‌కు ఉప ఎన్నిక

హైదరాబాద్ : రాష్ట్రంలోని హుజుర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. హర్యానా, మహారాష్ట్రలకు సాధారణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాలో ఖాళీలు ఏర్పడిన 64 అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపి స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఇసి శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులోనే హుజుర్‌నగర్ నియోజకవర్గం కూడా ఉంది. ఇసి షెడ్యూల్ ప్రకారం ఉప ఎన్నికకు ఈ నెల 23న నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. వచ్చే నెల 21వ తేదీన పోలింగ్, 24వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. గడిచిన డిసెంబర్‌లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో హుజుర్‌నగర్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందిన ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ తరువాత పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ ఎంపిగా గెలుపొందడంతో తన ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైనందున సూర్యాపేట జిల్లాలో శనివారం నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని రాష్ర్ట ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ మీడియాకు తెలిపారు. కోడ్ అమల్లో ఉన్నందున జిల్లాకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి విధానపరమైన ప్రకటనలు చేయరాదని స్పష్టం చేశారు. జిల్లాలో మంత్రులు, ఎంఎల్‌ఎలు అధికారిక కార్యక్రమాలలో పాల్గొనరాదన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలు కూడా చేపట్టరాదన్నారు. 2019 జనవరి 1 నాటి ఓటర్ల జాబితా ప్రకారమే ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హుజూర్‌నగర్ ఎపి సరిహద్దులో ఉన్నందున మరింత నిఘా పెడతామని తెలిపారు. మద్యం, డబ్బు సరఫరా ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. సి -విజిల్ యాప్ ద్వారా ఉల్లంఘనలపై ఫిర్యాదులు చేయొచ్చని ఓటర్లకు రజత్ కుమార్ సూచించారు.

By-election for Huzurnagar Assembly seat

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post హుజూర్‌నగర్ వార్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: