తెలంగాణలోనే విద్యార్థులకు సన్నబియ్యం

  కేంద్రం ఏడో తరగతికే పరిమితం చేస్తే మేం పదో తరగతి వరకు మధ్యాహ్న భోజనం పెడుతున్నాం సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన గురుకులాలు అద్భుతంగా నడుస్తున్నాయి, విద్యాహక్కు చట్టాన్ని పునఃపరిశీలించాలి ఢిల్లీ విద్యామంత్రుల సమావేశంలో సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్ : విద్యాహక్కు చట్టాన్ని పునఃపరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.స బితా ఇంద్రారెడ్డి అన్నారు. నూతన విద్యావిధానం ముసాయిదాపై సెంట్రల్ ఎడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యూకేషన్(సిఎబిఇ) ఆధ్వర్యంలో శనివారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో […] The post తెలంగాణలోనే విద్యార్థులకు సన్నబియ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కేంద్రం ఏడో తరగతికే పరిమితం చేస్తే
మేం పదో తరగతి వరకు మధ్యాహ్న
భోజనం పెడుతున్నాం

సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన గురుకులాలు అద్భుతంగా నడుస్తున్నాయి, విద్యాహక్కు చట్టాన్ని పునఃపరిశీలించాలి

ఢిల్లీ విద్యామంత్రుల సమావేశంలో సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్ : విద్యాహక్కు చట్టాన్ని పునఃపరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.స బితా ఇంద్రారెడ్డి అన్నారు. నూతన విద్యావిధానం ముసాయిదాపై సెంట్రల్ ఎడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యూకేషన్(సిఎబిఇ) ఆధ్వర్యంలో శనివారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల సమావేశంలో మంత్రి సబితా ఇం ద్రారెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. నూతన విద్యావిధా న ం ముసాయిదాపై సూచనలు, సలహాలు అడిగారన్నారు. 8, 9, 10 తరగతుల్లో వృత్తి విద్యా అ మలు చేయాలని కేంద్రం సూచించిందని వెల్లడించా రు.

పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశ పెట్టాలని పాలసీలో ఉందని, దీనిని స్వాగతిస్తున్నామని చెప్పారు. పూర్వ ప్రాథమిక విద్యకు అయ్యే ఖర్చును కేంద్రమే భరించాలని కోరామని తెలిపారు. తరగతులు ప్రారంభిస్తున్నప్పు డు స్థానికులనే నియమించుకోవాలని కోరామని తెలిపారు. ఒత్తిడిలో ఉండే విద్యార్థులకు కౌన్సిలింగ్ ఉపయోగకరంగా ఉంటుందని, విద్యార్థుల కోసం జిల్లాకొక కౌన్సిలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరామన్నారు. జాతీయ మెరిట్ స్కాలర్‌షిప్ మాదిరిగా జాతీయ అటెండెన్స్ పాలసీ పెట్టి విద్యార్థులను ప్రోత్సహించాలని చెప్పామని తెలిపారు. పాఠశాలల్లో మాతృభాషను అమలు చేయాలని చెబుతున్నారని, ప్రైవేట్ విద్యాసంస్థల్లో కూడా ఈ విధానం అమలు చేయాలని చెప్పామన్నారు.

తెలంగాణలో కేంద్రంతో సంబంధం లేకుండా విద్యా వ్యాప్తికి చాలా కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. కేంద్రం 7వ తరగతి వరకే మధ్యా హ్నం భోజనం అమలు చేస్తోందని, కాగా రాష్ట్రంలో 10వ తరగతి వరకు మధ్యాహ్నం భోజనం పెడుతున్నామన్నారు. సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన గురుకులాలు విజయవంతంగా నడుస్తున్నాయని చెప్పారు. విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలు మానేసి ప్రభుత్వ గురుకులాల్లో చేరుతున్నారన్నారు.

మోడల్ స్కూల్ వ్యవస్థను కేంద్రం పక్కనపెట్టడంతో తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చుతో నిర్వహిస్తోందని తెలిపారు. మిగతా రాష్ట్రాలు మన గురుకులాల వైపు చూస్తున్నాయన్నారు. పేద విద్యార్థులకు విదేశీ విద్యను అందించేందుకు ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల ఆర్ధిక సహాయం చేస్తున్నామన్నారు. సుమారు 1,995 మంది విద్యార్థులు విదేశాలలో విద్యనభ్యసిస్తున్నారని అన్నారు. ప్రతి విద్యార్థి బడి ఉండాలి..ఉన్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.

Gives lunch to the up to Tenth grade

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తెలంగాణలోనే విద్యార్థులకు సన్నబియ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.