ద్రవ్య లోటుపై ప్రభావం తక్కువే

  పెరిగే పన్ను వసూళ్ల ద్వారా భర్తీ చేసుకోవచ్చు కార్పొరేట్ పన్ను తగ్గింపుపై నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ ముంబయి: కార్పొరేట్ పన్నుల్లో 1.45 లక్షల కోట్ల రూపాయల మేర రాయితీలు ఇచ్చినప్పటికీ అది ద్రవ్యలోటుపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ శనివారం ఇక్కడ చెప్పారు. ఈ రాయితీల కారణంగా కార్పొరేట్ పన్ను వసూళ్లలో తగ్గుదలను అధిక వృద్ధి కారణంగా పెరిగే పన్ను వసూళ్ల ద్వారా భర్తీ చేసుకోవచ్చని ఆయన […] The post ద్రవ్య లోటుపై ప్రభావం తక్కువే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పెరిగే పన్ను వసూళ్ల ద్వారా భర్తీ చేసుకోవచ్చు
కార్పొరేట్ పన్ను తగ్గింపుపై నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్

ముంబయి: కార్పొరేట్ పన్నుల్లో 1.45 లక్షల కోట్ల రూపాయల మేర రాయితీలు ఇచ్చినప్పటికీ అది ద్రవ్యలోటుపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ శనివారం ఇక్కడ చెప్పారు. ఈ రాయితీల కారణంగా కార్పొరేట్ పన్ను వసూళ్లలో తగ్గుదలను అధిక వృద్ధి కారణంగా పెరిగే పన్ను వసూళ్ల ద్వారా భర్తీ చేసుకోవచ్చని ఆయన అన్నారు. భారీ ఎత్తున పన్ను రాయితీల కారణంగా వృద్ధి రేటు గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని, ఫలితంగా పన్ను వసూళ్లు కూడా పెరుగుతాయని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కార్పొరేట్ పన్నును 10నుంచి 12 శాతం మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనివల్ల కార్పొరేట్ పన్ను వసూళ్ల రాబడి రూ.1.45 లక్షల కోట్ల మేర తగ్గుతుందని అంచనా. అయితే పన్ను తగ్గింపు కారణంగా ద్రవ్యలోటు భారీగా పెరుగుతుందని తాను అనుకోవడం లేదని రాజీవ్ కుమార్ ఇక్కడ ‘ ఇండియా టుడే’ కార్యక్రమం సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు.

కొంత మేర ప్రభావం ఉండవచ్చని, అది చాలా స్వల్పంగానే ఉండవచ్చని ఆయన అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు స్థూల జాతీయ ఉత్పతి ్త( జిడిపి)లో 3.1 శాతం మేర ఉండవచ్చని బడ్జెట్‌లో ప్రభుత్వం అంచనా వేసింది. అయితే వివిధ వర్గాలకు ప్రకటించిన రాయితీలు జిడిపిలో 0.7 శాతం మేర ఉన్నందున ద్రవ్య లోటు కూడా ఆ మేర పెరిగి 4.1 శాతానికి పెరగవచ్చని విశ్లేషకులు అంటున్నారు. విశేషమేమిటంటే శుక్రవారం కార్పొరేట్ పన్ను తగ్గింపు ప్రకటన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆర్థిక మంత్రి కానీ, ఇతర కేబినెట్ సహచరులు కానీ పన్నుల తగ్గింపు తర్వాత ద్రవ్య లోటు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందన్న విలేఖరుల ప్రశ్నలకు సమాధానం దాట వేయడం గమనార్హం. అంతేకాదు, ఒక రోజు ముందు ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వృద్ధిని వేగవంతం చేసే చర్యగా అభివర్ణించారు.

గత ఆర్థిక సంవత్సరంలో ఒకటి రెండు నెలలు మినహాయిస్తే ఏడాది అంతా కూడా జిఎస్‌టి వసూళ్లు ప్రభుత్వం ఆశించినట్లుగా లక్ష కోట్ల రూపాయల స్థాయికి చేరుకోలేదు. మరో వైపు ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు కేవలం 4.7 శాతమే పెరిగాయి. ఆర్థిక సంవత్సరం మొత్తానికి ప్రత్యక్ష పన్ను వసూళ్లు 17.5 శాతం మేర పెరగాలని బడ్జెట్‌లో లక్షంగా పెట్టుకోగా, తొలి ఆరు నెలల్లో కేవలం 4.7 శాతం పెరిగి రూ.5.5లక్షల కోట్లు మాత్రమే ఉండడం గమనార్హం. అయితే ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన పన్ను రాయితీల తర్వాత ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్ల రాబడి పెరగవచ్చని ఆశిస్తున్నట్లు రాజీవ్ కుమార్ చెప్పారు. వృద్ధి రేటు పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని, అందువల్ల దానితో పాటుగా ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు కూడా పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణపైన దృష్టి పెట్టడం కూడా తన ఆశాభావానికి మరో కారణమని ఆయన చెప్పారు.

ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ద్వారా రూ.1.05 లక్షల కోట్లను సమకూర్చుకోవాలని లక్షంగా పెట్టుకున్నట్లు కేంద్రం బడ్జెట్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఆస్తుల అమ్మకం ద్వారా అదనంగా రూ.52,000 కోట్లు లభిస్తాయని, అలాగే ఆర్‌బిఐనుంచి మరో 50 వేల కోట్లు రావలసి ఉందని , ఈ మొత్తాన్ని బడ్జెట్‌లో చేర్చలేదని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు చెప్పారు. పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా వచ్చే అధిక రాబడి ద్వారా ప్రభుత్వం ద్రవ్య లోటును భర్తీ చేస్తుందని కూడా ఆయన చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు కేవలం 5 శాతంగా ఉన్నప్పటికీ అదేమీ సమస్య కాదని, ఈ ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్ధి రేటును సాధిస్తామని, అలాగే రాబోయే అయిదేళ్లలో తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష సాధన దిశగా సరయిన మార్గంలోనే ప్రయాణిస్తున్నామని రాజీవ్ కుమార్ చెప్పారు.

Corporate tax cut to have minor impact on fiscal deficit

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ద్రవ్య లోటుపై ప్రభావం తక్కువే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.