నోరూర…

  ఫిష్ కేక్స్ కావాల్సినవి: ముళ్లు తీసిన చేప ముక్కలు: 2కప్పులు, బ్రెడ్‌పొడి:అరకప్పు, శనగపిండి: పావుకప్పు, గుడ్లసొన:అరకప్పు, ఉల్లిపాయ తరుగు: పావు కప్పు, ఆవాల పొడి:అర టీస్పూన్, ఉప్పు:తగినంత, కొత్తిమీర తరుగు:1టేబుల్ స్పూన్, పసుపు:చిటికెడు, కారం:చిటికెడు, తాజా నిమ్మరసం:2టీస్పూన్లు, నూనె: సరిపడా తయారీ విధానం: ముందుగా చేప ముక్కలను బాగా ఉడికించాలి. తర్వాత వాటిని ఓ గిన్నెలో వేసి కాస్తంత చిదుముకోవాలి. తర్వాత అందులో శనగపిండి, ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర తరుగు, పసుపు, ఆవాలపొడి, ఉప్పు, కారం, […] The post నోరూర… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఫిష్ కేక్స్
కావాల్సినవి: ముళ్లు తీసిన చేప ముక్కలు: 2కప్పులు, బ్రెడ్‌పొడి:అరకప్పు, శనగపిండి: పావుకప్పు, గుడ్లసొన:అరకప్పు, ఉల్లిపాయ తరుగు: పావు కప్పు, ఆవాల పొడి:అర టీస్పూన్, ఉప్పు:తగినంత, కొత్తిమీర తరుగు:1టేబుల్ స్పూన్, పసుపు:చిటికెడు, కారం:చిటికెడు, తాజా నిమ్మరసం:2టీస్పూన్లు, నూనె: సరిపడా

తయారీ విధానం: ముందుగా చేప ముక్కలను బాగా ఉడికించాలి. తర్వాత వాటిని ఓ గిన్నెలో వేసి కాస్తంత చిదుముకోవాలి. తర్వాత అందులో శనగపిండి, ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర తరుగు, పసుపు, ఆవాలపొడి, ఉప్పు, కారం, నిమ్మరసం వేసి కలపాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చేతుల్లోకి కొద్దికొద్దిగా తీసుకుని ఒత్తుకోవాలి. తర్వాత వాటిని గుడ్లసొనలో ముంచాలి. ఆపైన వాటిని బ్రెడ్‌పొడిలో దొర్లించి నూనెలో డీప్‌ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటిని వేడివేడిగా ఉన్నప్పుడే మీకు నచ్చినట్టుగా సర్వ్ చేసుకోవాలి. డీప్‌ఫ్రై వద్దనుకుంటే, కొద్దికొద్దిగా నూనెను చల్లుకుంటూ పెనంపై ఇరువైపులా కాల్చుకోవచ్చు. వేడివేడిగా తింటే ఈ వంటకం బాగుంటుంది.

చికెన్ చిల్లీ బజ్జీ
కావాల్సినవి: చికెన్: పావు కిలో, అల్లం పేస్ట్: 2 టీస్పూన్లు, పసుపు: 1టీస్పూన్, కారం ౩ టీస్పూన్లు, ఉప్పు: తగినంత, మిరియాల పొడి: అరటీస్పూన్, చికెన్ మసాలా: ఒకటిన్నర టీస్పూన్, చికెన్ మసాలా, ఉల్లి ముక్కలు:2కప్పులు, పచ్చి మిర్చి ముక్కలు:1టీస్పూన్, టమాటా :2కప్పులు, బజ్జీ మిర్చి: 10, శనగపిండి: 2కప్పులు, నీళు, నూనె: తగినంత.

తయారీ విధానం: శుభ్రం చేసుకున్న చికెన్‌లో ఒక టీస్పూన్ అల్లం పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, మిరియాల పొడి, చికెన్ మసాలా, నీళ్లు వేసుకుని మెత్తగా ఉడికించు కోవాలి. దాంట్లోని సూప్‌నంతా తీసి పక్కన పెట్టుకుని, మెత్తగా ఉడికిన చికెన్ ముక్కలను పొడిపొడి చేసుకోవాలి. పాన్‌లో నూనె వేసుకుని, ఉల్లి పాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు, మిగిలిన అల్లం పేస్ట్ వేసుకుని దోర గా వేగించాలి. చికెన్‌ని, సూప్‌కూడా అందులో వేసుకుని ఉడకనివ్వాలి. బజ్జీ మిర్చీలోని గింజలను తొలగించి అందులో ఆ చికెన్, టమాటా మిశ్రమాన్ని పెట్టుకోవాలి. శనగపిండి, కారం, సరిపడా నీళ్లు పోసి బజ్జీ పిండిలా చేయాలి. అందు లో చికెన్,టమాటా మిశ్రమాన్ని నింపిన మిర్చీలను నూనెలో డీప్‌ఫ్రై చేసుకోవాలి.

పిజ్జా మఫిన్స్
కావాల్సినవి: మైదాపిండి: 2 కప్పులు, బేకింగ్ పౌడర్: 2 టీస్పూన్లు, చిక్కటి పాలు: 1 కప్పు, గుడ్లు:2, నూనె: ౩ టేబుల్ స్పూన్లు, టమాటా ముక్కలు: 1 కప్పు, వెల్లుల్లి గుజ్జు: అరటీస్పూన్, కాలీఫ్లవర్ తురుము: అర కప్పు, చీజ్: అరకప్పు,

తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మైదాపిండి, బేకింగ్ పౌడర్, నూనె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో పాలు పోసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత గుడ్లు, టమాటా సాస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి గుజ్జు, కాలీఫ్లవర్ తురుము, టమాటా ముక్కలు, చీజ్ వేసుకుని బాగా కలపాలి. తర్వాత ఒక పాన్ తీసుకుని అందులోంచి ఆ మిశ్రమాన్ని నింపుకుని ఓవెన్ 20 నుంచి 25 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అవి చల్లారిన తర్వాత అరటిపండు ముక్కలు లేదా డ్రైఫ్రూట్స్‌తో సర్వ్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది.

బనానా ఫుడ్డింగ్ రోల్స్
కావాల్సినవి: చిలగడదుంపల గుజ్జు:1కప్పు( దుంపలను మెత్తగా ఉడికించి ముద్దలా చేసుకోవాలి) చిక్కటి పాలు: అర లీటర్, బేకింగ్ సోడా: కొద్దిగా, పంచదార:ఒకటింపావు కప్పులు, ఏలకుల పొడి: చిటికెడు, బిస్కెట్ పౌడర్: అరకప్పు, అరటిపండ్లు:3, ఎగ్ రోల్స్ వేఫర్స్: 6, టాపింగ్ క్రీమ్:సర్వ్ చేసుకున్నప్పుడు అభిరుచికిని బట్టి.

తయారీ విధానం: ముందుగా పాన్‌లో పాలు వేసుకుని అందులో పంచదార, బేకింగ్ సోడా వేసుకుని, గరిటెతో తిప్పుతూ బాగా మరిగించాలి. ఆ మిశ్రమం అంతా ఇంచుమించు సగం పరిమాణంలోకి వచ్చిన తర్వాత అందులో చిలగడదుంప గుజ్జు వేసుకుని, దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక్కో అరటిపండుని రెండు లేదా మూడు ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఎగ్ రోల్ వేఫర్స్ తీసుకుని దాని మధ్యలో చిలగడదుంప, పాల మిశ్రమాన్ని కొద్దిగా పెట్టుకుని దానిపైన అరటిపండు ముక్కను పెట్టుకుని, వేపర్‌కి నాలుగువైపులా తడిచేసి చుట్టు కోవాలి. ఇప్పుడు వాటిని నూనెలో దోరగా వేయించుకోవాలి. నూనెలోంచి తియ్యగానే బిస్కెట్ పౌడర్‌లో వేసి వాటికి బాగా పౌడర్ పట్టించాలి. టాపింగ్ క్రీమ్‌తో సర్వ్ చేసుకుంటే రుచిగా ఉంటాయి.

 

రొయ్యల పకోడి
కావాల్సినవి: రొయ్యలు : 25 లేదా ౩౦, శనగపిండి: పావు కప్పు, బ్రెడ్ పౌడర్: 4టేబుల్ స్పూన్లు, బియ్యంప్పిండి: 1 టేబుల్ స్పూన్, మొక్కజొన్న పిండి: టేబుల్ స్పూన్, పసుపు:చిటికెడు, ఉప్పు:తగినంత, నిమ్మరసం: 1 టేబుల్ స్పూన్, నీళ్లు, నూనె: సరిపడా

తయారీ విధానం: ముందుగా రొయ్యలు బాగా కడిగి ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు మరో బౌల్‌లో శనగపిండి, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, కారం, ఉప్పు, పసుపు, నిమ్మరసం,అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రెడ్ పౌడర్ వేసి కొద్దికొద్దిగా నీళ్లు వేసుకుంటూ బజ్జీల పిండిలా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయిలో నూనె వేడి చేసుకుని… ఒక్కో రొయ్యను శనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.

South Indian Variety Recipes

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నోరూర… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: