19 లక్షల మంది పేర్లు ఎన్‌ఆర్‌సిలో తొలగించారు

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుసుకున్నారు. అస్సాంలో ఎన్‌ఆర్‌సిని అమలు చేసిన తర్వాత అమిత్ షాను ఆమె కలుసుకోవడం ఇదే మొదటిసారి. నార్త్ బ్లాక్‌లోని హోం శాఖ కార్యాలయంలో ఆయనను కలుసుకున్న మమత అస్సాంతో ఎన్‌ఆర్‌సి అమలు చేశాక హిందీ, బెంగాలీ, స్థానిక అస్సామీ భాషను మాట్లాడే చాలామంది నిజమైన ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయని వివరించారు. దాదాపు 19 లక్షల మందికి ఎన్‌ఆర్‌సిలో చోటు దక్కలేదని […] The post 19 లక్షల మంది పేర్లు ఎన్‌ఆర్‌సిలో తొలగించారు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుసుకున్నారు. అస్సాంలో ఎన్‌ఆర్‌సిని అమలు చేసిన తర్వాత అమిత్ షాను ఆమె కలుసుకోవడం ఇదే మొదటిసారి. నార్త్ బ్లాక్‌లోని హోం శాఖ కార్యాలయంలో ఆయనను కలుసుకున్న మమత అస్సాంతో ఎన్‌ఆర్‌సి అమలు చేశాక హిందీ, బెంగాలీ, స్థానిక అస్సామీ భాషను మాట్లాడే చాలామంది నిజమైన ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయని వివరించారు. దాదాపు 19 లక్షల మందికి ఎన్‌ఆర్‌సిలో చోటు దక్కలేదని ఆమె చెప్పారు.

నిజమైన స్థానికుల పేర్లను జాబితాలో చేర్చాలని కోరుతూ అమిత్ షాకు వినతిపత్రం అందచేసినట్లు ఆమె మీడియాకు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్‌ఆర్‌సిని అమలు చేయడంపై అమిత్ షా మాట్లాడలేదని, అయితే తన రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సి అవసరం లేదన్న తన వైఖరిని ఎప్పుడో వెల్లడించానని ఆమె చెప్పారు. మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న మమత బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్న విషయం తెలిసిందే.

Mamata Banerjee meets Amit Shah The Trinamool Congress chief met Shah at his office at the North Block, a day after she met Prime Minister Narendra Modi on Wednesday evening.

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 19 లక్షల మంది పేర్లు ఎన్‌ఆర్‌సిలో తొలగించారు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.