పేద పిల్లల ఆకలి తీరుస్తున్న ప్రైవేట్ స్కూలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం తీరుతెన్నులు ఎలా ఉన్నప్పటికీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని గురుగ్రామ్‌లో పేద వర్గాల కోసం నడుస్తున్న ఒక ప్రైవేట్ పాఠశాల మాత్రం ప్రభుత్వ ఆర్థిక సహకారం ఏమాత్రం లేకున్నప్పటికీ ఈ పథకం ఆశయాలను పుణికిపుచ్చుకుని పేద, అట్టడుగు వర్గాల పిల్లల ఆకలిని తీర్చే అన్నపూర్ణగా మారిపోయింది. ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన కెప్టెన్ రాజేష్ శరణ్, తన భార్య శాంత శరణ్‌తో కలసి […] The post పేద పిల్లల ఆకలి తీరుస్తున్న ప్రైవేట్ స్కూలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం తీరుతెన్నులు ఎలా ఉన్నప్పటికీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని గురుగ్రామ్‌లో పేద వర్గాల కోసం నడుస్తున్న ఒక ప్రైవేట్ పాఠశాల మాత్రం ప్రభుత్వ ఆర్థిక సహకారం ఏమాత్రం లేకున్నప్పటికీ ఈ పథకం ఆశయాలను పుణికిపుచ్చుకుని పేద, అట్టడుగు వర్గాల పిల్లల ఆకలిని తీర్చే అన్నపూర్ణగా మారిపోయింది. ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన కెప్టెన్ రాజేష్ శరణ్, తన భార్య శాంత శరణ్‌తో కలసి 2008లో దీక్ష స్కూలును స్థాపించారు.

తాము నివసించే పరిసరాలలోని పేద పిల్లలు చదువుకునే స్తోమత లేక, తినడానికి సరైన తిండి లేక వీధుల్లో ఖాళీగా సంచరించడాన్ని చూసి చలించిపోయిన ఆ దంపతులు ఆ వలస కార్మికులు, బడుగు వర్గాల పిల్లల కోసం ఈ స్కూలును ఏర్పాటుచేయడమే కాక మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా మొదలుపెట్టారు. అయితే ఈ స్కూలు ప్రత్యేకత ఏమిటంటే పిల్లలకు రుచికరమైన, శుచికరమైన, పోషక విలువలతో కూడిన చక్కని భోజనాన్ని కడుపునిండా పెట్టడమే. 13 మంది పిల్లలతో ప్రారంభమైన ఈ పాఠశాలలో ఇప్పుడు 410 పిల్లలు చదువుతున్నారు.

నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులందరికీ ఇక్కడ మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా అందచేస్తున్నారు. ఉదయం 10-10.30 ప్రాంతంలో అరటిపళ్లు, బిస్కెట్లు వంటి అల్పాహారాన్ని ఇస్తారు. తిరిగి మధ్యాహ్నం ఒంటిగంటకు సాంబార్, కూర, అన్నంతో కూడిన భోజనం వడ్డిస్తారు. వంట చేయడానికి ఇద్దరు వంటవాళ్లను నియమించారు. స్వచ్ఛంద సేవకులు, టీచర్లు కలసి పిల్లలకు మధ్యాహ్న భోజనం అందచేస్తారు. భోజనానికి పరిమితం లేదని, పిల్లలు తిన్నంత వడ్డిస్తామని శాంతా శరణ్ చెప్పారు. ఇక్కడ చదువుకునే విద్యార్థులలో అత్యధికులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల పిల్లలని, తల్లిదండ్రులు ఇద్దరూ పనికి వెళ్లి పోవడంతో వారికి సరైన భోజనం కూడా లభించదని, అందుకే వారికి సకాలంలో, పౌష్టికాహారాన్ని అందచేయడమే ధ్యేయంగా పెట్టుకున్నామని ఆమె చెప్పారు.

రోజుకు 16 కిలోల బియ్యం, 14 కిలోల పెసరపప్పు, 6-8 కిలోల కూరగాయలు అవసరమవుతాయని, ఇందుకోసం రోజుకు రూ. 3,500 ఖర్చవుతుందని ఆమె తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, ఇరుగుపొరుగు ప్రజలు ఇచ్చే నిధులతో ఈ పథకాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని ఆమె వివరించారు. ఇంతమంది పిల్లలకు రొట్టెలు తయారుచేయడం శ్రమతో కూడుకున్న పనేకాక సకాలంలో అందివ్వలేమన్న కారణంతోనే అన్నం పెడుతున్నామని ఆమె చెప్పారు. పిల్లలకు సరైన భోజనాన్ని సమకూర్చలేని తల్లిదండ్రులు తమ పిల్లలను ఇదే స్కూలుకు పంపుతున్నారని, మధ్యలో చదువును మాన్పించడానికి కూడా వారు ఇష్టపడడం లేదని శాంతా శరణ్ చెప్పారు.

ప్రతి తరగతిలో 35 మంది విద్యార్థులను మాత్రమే ఇక్కడ చేర్చుకుంటున్నామని, ఎక్కువ దరఖాస్తులు వచ్చినప్పటికీ స్కూలు భవనం సరిపోయే పరిస్థితి లేదని ప్రిన్సిపాల్ అనేజా తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు పేదవర్గాలకు చెందిన వారని స్కూలు కమిటీ ప్రత్యక్షంగా తనిఖీ చేసి నిర్ధారించుకున్నాకే స్కూలులో చేర్చుకుంటామని ఆమె వివరించారు. కేంద్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థులలో పౌష్టికాహార లోపాన్ని తొలగించి, డ్రాప్ అవుట్లను నివారించడానికి 1995లో కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టింది. 2001లో దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు దీన్ని విస్తరింపచేసిది. 2018-19 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 11.35 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లోని 9.12 కోట్ల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేస్తున్నారు.

అయితే, ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఒక స్కూలులో విద్యార్థులకు రొట్టె, ఉప్పు వడ్డించిన విషయం తెలిసిందే. అలాగే 2018 ఆగస్టులో జార్ఖండ్‌లోని ఒక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని ఒక విదార్థి మరణించగా 60 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యారు. ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వ సాయం లేకుండానే ఒక ప్రైవేట్ పాఠశాల పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విజయవంతంగా అమలుచేస్తుండడం ప్రశంసనీయం.

This Gurgaon School Provides Power Lunch To Its Students To Tackle Malnutrition Rashtriya Poshan Maah: Malnutrition continues to hinder the potential of millions of children in India but this Gurgaon school shows that this scenario can be changed by providing wholesome mid-day meals to the children

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పేద పిల్లల ఆకలి తీరుస్తున్న ప్రైవేట్ స్కూలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.