తేజ‌స్‌లో విహరించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌

బెంగళూరు : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం తేజస్ యుద్ధ విమానంలో విహరించారు. బెంగళూరు ఎయిర్ పోర్టు నుంచి ఆయన లైట్ కంబాట్ యుద్ధ విమానంలో 30 నిమిషాల పాటు ఆకాశంలో విహరించారు. తేజస్ లో విహరించడం చాలా సౌకర్యవంతంగా ఉందని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ ట్రిప్ ను తాను చాలా ఎంజాయ్ చేశానని ఆయన తెలిపారు. హెచ్ఎఎల్, డిఆర్ డిఒ తదితర ఏజెన్సీలకు రాజ్ నాథ్ శుభాకాంక్షలు […] The post తేజ‌స్‌లో విహరించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

బెంగళూరు : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం తేజస్ యుద్ధ విమానంలో విహరించారు. బెంగళూరు ఎయిర్ పోర్టు నుంచి ఆయన లైట్ కంబాట్ యుద్ధ విమానంలో 30 నిమిషాల పాటు ఆకాశంలో విహరించారు. తేజస్ లో విహరించడం చాలా సౌకర్యవంతంగా ఉందని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ ట్రిప్ ను తాను చాలా ఎంజాయ్ చేశానని ఆయన తెలిపారు. హెచ్ఎఎల్, డిఆర్ డిఒ తదితర ఏజెన్సీలకు రాజ్ నాథ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ మాట్లాడారు. ప్రపంచ దేశాలకు యుద్ధ విమానాలను ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరుకోవడం ఆనందం కలిగించే విషయమని ఆయన చెప్పారు. కొద్ది సేపు రాజ్ నాథ్ యుద్ధ విమానాన్ని కంట్రోల్ చేశారని డిఆర్ డిఒ చీఫ్ డాక్టర్ సతీశ్ రెడ్డి తెలిపారు.

Defense Minister Rajnath Traveled In Tejas

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తేజ‌స్‌లో విహరించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.