పారేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లతో స్కూలు టాయిలెట్

నాసిక్: ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషం దాదాపు 10 లక్షల ఒక సారి వాడి పడేసే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను ప్రజలు కొంటున్నారని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమ సంస్థ చెబుతోంది. అయితే వాడిపారేసే ప్లాస్టిక్ వ్యర్థాల బెడదను ఎలా వదిలించుకోవాలో ఎవరికీ అంతుబట్టడం లేదు. కాని, మహారాష్ట్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడిచే ఆ గిరిజన ఆశ్రమ పాఠశాల మాత్రం ప్లాస్టిక్ వ్యర్థాలతో బాలికలకు టాయిలెట్ నిర్మించి ఇలా కూడా ప్లాస్టిక్ సమస్యను నివారించవచ్చని రుజువు చేసింది. […] The post పారేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లతో స్కూలు టాయిలెట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నాసిక్: ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషం దాదాపు 10 లక్షల ఒక సారి వాడి పడేసే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను ప్రజలు కొంటున్నారని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమ సంస్థ చెబుతోంది. అయితే వాడిపారేసే ప్లాస్టిక్ వ్యర్థాల బెడదను ఎలా వదిలించుకోవాలో ఎవరికీ అంతుబట్టడం లేదు. కాని, మహారాష్ట్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడిచే ఆ గిరిజన ఆశ్రమ పాఠశాల మాత్రం ప్లాస్టిక్ వ్యర్థాలతో బాలికలకు టాయిలెట్ నిర్మించి ఇలా కూడా ప్లాస్టిక్ సమస్యను నివారించవచ్చని రుజువు చేసింది. 41 ఏళ్ల క్రితం ఏర్పడిన వైతర్ణ ఆశ్రమ పాఠశాలలో 254 మంది బాలురు, 35 మంది బాలికలు చదువుకుంటున్నారు.

ఈ పిల్లలంతా స్థానిక గిరిజన తెగలకు చెందిన వారే. సమీపంలో వైతర్ణ డ్యాం ఉన్నప్పటికీ వైతర్ణ ఆశ్రమశాలకు మాత్రం నీటి సరఫరా లేదు. ఉన్న ఒక్క టాయిలెట్‌లో నీళ్లు ఉండవు. దాన్నే బాలికలు, బాలురతో పాటు టీచర్లు కూడా వాడుకోవలసిందే. ఈ బాధ భరించలేక బాలురు ఆరుబయటే మూత్రవిసర్జనకు వెళుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన వాటర్‌ఎయిడ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ బాలికల కోసం ప్రత్యేకంగా టాయిలెట్ నిర్మించడానికి ముందుకొచ్చింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌కి చెందిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగం కూడా దీనికి మద్దతు తెలిపింది.

అయితే తక్కువ ఖర్చుతో టాయిలెట్ నిర్మించాలన్న ఆలోచనతో 3,500 ఖాళీ వాటర్ బాటిళ్లు, స్థానికంగా లభించే వెదురును ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ వాటర్ బాటిళ్లను సమీపంలోని త్రయంబకేశ్వర్, అకోలె, ఇగత్‌పురి మున్సిపల్ కౌన్సిళ్ల నుంచి సేకరించారు. ఇటుకలకు ప్రత్యామ్నాయంగా వాటర్ బాటిళ్లను ఉపయోగించారు. పునాదులకు కూడా కూలగొట్టిన భవనాల శిథిలాలను వాడారు. లోపలి గోడలకు వెదురును ఉపయోగించారు. బయట గోడలకు అందమైన బొమ్మలను చిత్రించడంతో టాయిలెట్ స్వరూపమే వినూత్నంగా రూపొందింది. చాలా తక్కువ ఖర్చుతో ఈ టాయిలెట్ నిర్మాణం పూర్తి చేసినట్లు వాటర్‌ఎయిడ్ ఇండియా ప్రాజెక్టు అధికారి అభిజిత్ ఆవరి తెలిపారు.

School Toilet Made Out Of 3500 Discarded Plastic Bottles, Vaitarna Ashramshala school in Nashik, which did not have a functional toilet for their female students and teachers, now has a unique toilet made of discarded plastic bottles and bamboo

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పారేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లతో స్కూలు టాయిలెట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.