ఆ కుటుంబంలో అందరికీ లెక్కకు మించిన వేళ్లు

బెటుల్(మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్‌లోని ఒకే కుటుంబానికి చెందిన 25 మందికి కాళ్లూ, చేతులకు 10కి మించి వేళ్లు ఉన్నాయి. దీంతో వారికి చదువు, ఉద్యోగాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలీడాక్టిలీ అనే జన్యుపరమైన వ్యాధితో తామంతా పుట్టుక నుంచే బాధపడుతున్నామని, తమ కుటుంబంలోని 25 మంది సభ్యుల కాళ్లూ, చేతులకూ 10 కన్నా ఎక్కువ వేళ్లు ఉన్నాయని ఆ కుటుంబ సభ్యులలో ఒకరైన బల్దేవ్ యావలే వాపోయాడు. తన పిల్లలు స్కూలుకు వెళ్లినా చదువును పూర్తి చేయలేకపోయారని, తోటి […] The post ఆ కుటుంబంలో అందరికీ లెక్కకు మించిన వేళ్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

బెటుల్(మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్‌లోని ఒకే కుటుంబానికి చెందిన 25 మందికి కాళ్లూ, చేతులకు 10కి మించి వేళ్లు ఉన్నాయి. దీంతో వారికి చదువు, ఉద్యోగాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలీడాక్టిలీ అనే జన్యుపరమైన వ్యాధితో తామంతా పుట్టుక నుంచే బాధపడుతున్నామని, తమ కుటుంబంలోని 25 మంది సభ్యుల కాళ్లూ, చేతులకూ 10 కన్నా ఎక్కువ వేళ్లు ఉన్నాయని ఆ కుటుంబ సభ్యులలో ఒకరైన బల్దేవ్ యావలే వాపోయాడు. తన పిల్లలు స్కూలుకు వెళ్లినా చదువును పూర్తి చేయలేకపోయారని, తోటి విద్యార్థులు గేలి చేస్తుండడంతో మధ్యలోనే చదువు మానేశారని ఆయన చెప్పాడు.

తన చేతులు, కాళ్లకు వేళు అడ్డదిడ్డంగా వేళ్లు మొలవడంతో ఉద్యోగం ఇవ్వడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదని అతని కుమారుడు సంతోష్ అంటున్నాడు. మామూలు చెప్పులు, బూట్లు తనకు సరిపోవని, పదవ తరగతి వరకు చదువుకున్న తాను ఆర్మీ సెలెక్షన్ వెళ్లి ఫిజికల్ ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యానని అతను చెప్పాడు. తనకు చేతులకు 12 వేళ్లు, కాళ్లకు 14 వేళ్లు ఉన్నాయని, ప్రభుత్వమే తమకు ఏదో ఒక ఉపాధి చూపించాలని సంతోష్ కోరాడు. భోపాల్‌కు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెటుల్ గ్రామంలో యావలే కుటుంబం ఈ వ్యాధి కారణంగా బాగా పేరుపొందింది. ఈ కుటుంబాన్ని కలుసుకోవడానికి పొరుగు జిల్లాల నుంచి కూడా జనం వస్తుంటారట.

All 25 Members Of MP Family Has More Than 10 Fingers, Toes Baldev Yawale, one of the family members, said that there are 25 people in his family and everyone has polydactyly, a congenital condition of supernumerary fingers.

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆ కుటుంబంలో అందరికీ లెక్కకు మించిన వేళ్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.