తెలంగాణ పోలీసుల పనితీరు బాగుంది : కెసిఆర్

హైదరాబాద్ : తెలంగాణలో పోలీసుల పనితీరు చాలా బాగుందని సిఎం కెసిఆర్ తెలిపారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ప్రజలు సుఖంగా నిద్రపోతున్నారంటే, అందుకు పోలీసుల పనితీరే కారణమని ఆయన స్పష్టం చేశారు. పోలీసుల వారాంతపు సెలవులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. హోంగార్డులకు తెలంగాణలో ఇస్తున్న వేతనాలు దేశంలో ఎక్కడ కూడా ఇవ్వడం లేదని ఆయన చెప్పారు. హైదరాబాద్ నగరానికి మంచి భవిష్యత్ ఉందని కెసిఆర్ తెలిపారు.  హైదరాబాద్‌కు ఆరు వైపుల హెలిప్యాడ్స్ తో […] The post తెలంగాణ పోలీసుల పనితీరు బాగుంది : కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : తెలంగాణలో పోలీసుల పనితీరు చాలా బాగుందని సిఎం కెసిఆర్ తెలిపారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ప్రజలు సుఖంగా నిద్రపోతున్నారంటే, అందుకు పోలీసుల పనితీరే కారణమని ఆయన స్పష్టం చేశారు. పోలీసుల వారాంతపు సెలవులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. హోంగార్డులకు తెలంగాణలో ఇస్తున్న వేతనాలు దేశంలో ఎక్కడ కూడా ఇవ్వడం లేదని ఆయన చెప్పారు. హైదరాబాద్ నగరానికి మంచి భవిష్యత్ ఉందని కెసిఆర్ తెలిపారు.  హైదరాబాద్‌కు ఆరు వైపుల హెలిప్యాడ్స్ తో కూడిన సెంటర్స్ అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. విపత్తులనైనా ఎదుర్కొనేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ చాలా ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్, షీ టీమ్స్ అద్భుత ఫలితాలను ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు విఘాతం కలిగించే సంఘ విద్రోహక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు.  సింగరేణి కార్మికులకు కెసిఆర్ దసరా పండుగ కానుకను ప్రకటించారు. ఒక్కో కార్మికుడికి రూ. 1,00899ను బోనస్‌గా అందిచనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కెసిఆర్ నిర్ణయంపై సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Telangana Police Performance Is Good : CM KCR

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తెలంగాణ పోలీసుల పనితీరు బాగుంది : కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.