నాసిరకం విత్తనాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు : నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: రైతులకు నాసిరకం విత్తనాలు సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. నాసిరకం విత్తనాలు అమ్మే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని ఆయన స్పష్టం చేశారు. విత్తనోత్పత్తికి తెలంగాణ చాలా అనుకూలమైన ప్రాంతమని, సబ్సిడీపై రైతులకు విత్తనాలు అందిస్తున్నామని, నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో అమలవుతున్న సీడ్ పాలసీని కేంద్రం […] The post నాసిరకం విత్తనాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు : నిరంజన్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: రైతులకు నాసిరకం విత్తనాలు సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. నాసిరకం విత్తనాలు అమ్మే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని ఆయన స్పష్టం చేశారు. విత్తనోత్పత్తికి తెలంగాణ చాలా అనుకూలమైన ప్రాంతమని, సబ్సిడీపై రైతులకు విత్తనాలు అందిస్తున్నామని, నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో అమలవుతున్న సీడ్ పాలసీని కేంద్రం ఆదర్శంగా తీసుకుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని 31 నియోజకవర్గాల్లో విత్తన శుద్ధి యంత్రాలను నెలకొల్పామని ఆయన స్పష్టం చేశారు. రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంట్ ఇస్తూ రైతులను ఆదుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ నుంచి 18 దేశాలకు విత్తనాలను ఎగుమతి చేస్తున్నామని ఆయన తెలిపారు. 150 ఎకరాల్లో సీడ్ పార్క్ ను ఏర్పాటు చేస్తున్నామని, ఈ పార్కులో తమకు స్థలాలు కేటాయించాలని యుపి, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కోరుతున్నాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో రైతులందరూ సల్లగా ఉండాలన్న లక్ష్యంతో సిఎం కెసిఆర్ ముందుకు సాగుతున్నారని ఆయన తేల్చి చెప్పారు.

Strict Action On Supplying Inferior Seeds : Niranjan Reddy

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నాసిరకం విత్తనాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు : నిరంజన్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.