జూలై 5 నుంచి పెట్రో ధరలు పైపైకి

  న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలను బుధవారం మరోసారి పెంచారు. లీటర్‌కు 24 నుంచి 25 పైసల మేరకు పెరిగాయి. అయితే జూలై 5 తర్వాత ఒక రోజులో అత్యంత ఎక్కువ పెరుగుదల ఇదే. సౌదీ అరేబియా చమురు కర్మాగారాలపై డ్రోన్ల దాడుల కారణంగా ప్రపంచ చమురు మార్కెట్లలో సంక్షోభం తలెత్తింది. దీంతో దేశీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రభుత్వ రంగ రిటైల్ ఇంధన సంస్థల ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 25 […] The post జూలై 5 నుంచి పెట్రో ధరలు పైపైకి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలను బుధవారం మరోసారి పెంచారు. లీటర్‌కు 24 నుంచి 25 పైసల మేరకు పెరిగాయి. అయితే జూలై 5 తర్వాత ఒక రోజులో అత్యంత ఎక్కువ పెరుగుదల ఇదే. సౌదీ అరేబియా చమురు కర్మాగారాలపై డ్రోన్ల దాడుల కారణంగా ప్రపంచ చమురు మార్కెట్లలో సంక్షోభం తలెత్తింది. దీంతో దేశీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి.
ప్రభుత్వ రంగ రిటైల్ ఇంధన సంస్థల ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 25 పైసలు పెరిగి 72.42కు, డీజిల్ రేటు 24 పైసలు పెరిగి లీటరుకు 65.82 రూపాయలకు చేరాయి. అంతకుముందు మంగళవారం పెట్రోల్ ధర లీటరుకు 14 పైసలు, డీజిల్ ధర 15 పైసలు పెరిగింది. జులై 5న బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు సుమారు రూ.2.50 పెంచారు.

అప్పటి నుంచి బుధవారం పెరుగుదల అతి ఎక్కువ కావడం గమనార్హం. శనివారం సౌదీ అరేబియాలోని చమురు ప్లాంట్లపై డ్రోన్ దాడులు ఈ రేట్ల పెంపునకు కారణయ్యాయి. ఈ దాడులతో అంతర్జాతీయ మార్కెట్లో సోమవారం ఒక్క రోజే చమురు ధర సుమారు 20 శాతం పెరిగింది. ముప్పై ఏళ్లలో ఇదే అధిక స్థాయిలో పెరుగుదల, దాడుల వల్ల సౌదీ అరేబియా ఉత్పత్తిపై ప్రభావం చూపింది. అయితే ఆ తరువాత ధరలలో కొంత మెరుగుదల ఉంది. బుధవారం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 0.26 శాతం పడిపోయి 64.38 డాలర్లకు చేరుకుంది. సౌదీ అరేబియాలోని ప్రభావిత ప్లాంట్ల నుండి చమురు ఉత్పత్తులను వెంటనే పునరుద్ధరించినట్టు సంకేతాలిచ్చిన తరువాత ధరలు తగ్గాయి.

Petrol, diesel price sees steepest hike since July 5

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జూలై 5 నుంచి పెట్రో ధరలు పైపైకి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: