విలీన పోరాట యోధులను స్మరించుకుందాం

తెలంగాణ విలీన దినం సందర్భంగా తెలంగాణభవన్‌లో జాతీయ జెండా ఎగురవేసి ట్విట్టర్‌లో సందేశాన్నిచ్చిన మంత్రి కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు మంగళవారం తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కెటిఆర్ ట్వీట్ చేశారు. “భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనం అయిన నేడు.. ఆనాటి పోరాటంలో అసమాన త్యాగాలు […] The post విలీన పోరాట యోధులను స్మరించుకుందాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

తెలంగాణ విలీన దినం సందర్భంగా తెలంగాణభవన్‌లో జాతీయ జెండా ఎగురవేసి ట్విట్టర్‌లో సందేశాన్నిచ్చిన మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు మంగళవారం తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కెటిఆర్ ట్వీట్ చేశారు. “భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనం అయిన నేడు.. ఆనాటి పోరాటంలో అసమాన త్యాగాలు చేసిన వీరులను స్మరించుకుందాం.. జై తెలంగాణ, జై హింద్‌” ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఎగురవేసిన కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, శాసనమండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మాజీ మంత్రి సి.లకా్ష్మరెడ్డితో పాటు పలువురు ఎంఎల్‌ఎలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

KTR hoists National  flag at Telangana Bhavan

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post విలీన పోరాట యోధులను స్మరించుకుందాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.