మహా తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలను మహారాష్ట్రలోనూ అమలు చేయాలి, లేదా మా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలను తెలంగాణలో కలపండి– సిఎం కెసిఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన మహారాష్ట్ర నాందేడ్ జిల్లా నేతలు మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సం క్షేమ కార్యక్రమాలను తమ గ్రామాల్లోనూ అమలు చేయాలని, అలా చేయలేని పక్షం లో మా గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలోనై నా కలపాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు […] The post మహా తెలంగాణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలను మహారాష్ట్రలోనూ అమలు చేయాలి, లేదా మా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలను తెలంగాణలో కలపండి– సిఎం కెసిఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన
మహారాష్ట్ర నాందేడ్ జిల్లా నేతలు

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సం క్షేమ కార్యక్రమాలను తమ గ్రామాల్లోనూ అమలు చేయాలని, అలా చేయలేని పక్షం లో మా గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలోనై నా కలపాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల స్థానిక సం స్థల ప్రతినిధులు, ప్రజలు ఉద్యమ బాట ప ట్టారు. ఇదే నినాదంతో త్వరలో జరిగే మ హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని వారు నిర్ణయించారు. ఈ విషయాన్ని వారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు తెలిపి, తమ పోరాటానికి మ ద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. తాము టిఆర్‌ఎస్ పార్టీ టికెట్లపై పోటీ చేయడానికి కూ డా సిద్ధమని ప్రకటించారు. నాందేడ్ జిల్లా కు చెందిన నయ్ గావ్ (Naigaon) , బోక ర్ (Bhokar), డెగ్లూర్ (Degloor), కిన్వ ట్ (Kinwat), హథ్ గావ్ (Hathgaon) ని యోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు మంగళవారం హైదరాబాద్ లోని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిశారు. తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని ఉద్యమం నిర్వహించిన ఉద్యమ నాయకుడు, బాబ్లీ సర్పంచ్ బాబురావు గణపతిరావు కదమ్ నాయకత్వంలో వారు ముఖ్యమంత్రికి తమ గోడు వెల్లబోసుకున్నారు. మా గ్రామాలన్నీ తెలంగాణ గ్రామాలకు ఆనుకునే ఉన్నాయి. కానీ మా గ్రామాల పరిస్థితి, తెలంగాణ గ్రామాల పరిస్థితి చాలా భిన్నంగా ఉన్నాయి.

తెలంగాణలో రైతులు, పేద ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. మేమంతా బాధల్లో ఉన్నామని, తెలంగాణలో రైతులకు ఎకరానికి ఏడాదికి 10 వేల రూపాయల సహాయం రైతుబంధు పథకం ద్వారా అందుతున్నదన్నారు. కానీ మా గ్రామాల్లో ప్రభుత్వం నుంచి రైతులకు ఇలాంటి సాయమేదీ చేయడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. తెలంగాణలో రైతుబీమా అమలవుతున్నదని, ఇది కూడా మా రాష్ట్రంలో అమలు జరగడం లేదన్నారు. తెలంగాణలో పేదలకు 2వేల రూపాయల పెన్షన్ వస్తుండగా, మా రాష్ట్రంలో కేవలం 600 రూపాయలు మాత్రమే వస్తున్నదని సిఎం కెసిఆర్‌కు వివరించారు. తెలంగాణలో రైతులకు 24 గంటల కరెంటు ఉచితంగా అందుతుండగా, మహరాష్ట్రలో 8 గంటలు ఇస్తామని చెప్పి, ఆరు గంటలు మాత్రమే ఇస్తున్నారన్నారు. దీని వల్ల రైతులు పడరాని పాట్లు పడుతున్నారని సిఎం కెసిఆర్ వద్ద వారు వాపోయారు. తెలంగాణ, మహారాష్ట్ర గ్రామాల మధ్య వివాహ సంబంధాలు కూడా ఉన్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ కిట్స్, కల్యాణలక్ష్మి, పండుగలకు దుస్తుల పంపిణీ లాంటి పథకాలు మహిళలను ఎంతో ఆదుకుంటున్నాయి. మహారాష్ట్రలో ఇలాంటి పథకాల ఊసే లేదని వారు వ్యాఖ్యానించారు. తెలంగాణలో రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. మా దగ్గర అద్వాన్నంగా ఉన్నాయి” అని వారు తమ బాధను వెలిబుచ్చారు. “సాగునీటి విషయంలో కూడా మా పరిస్థితి ఘోరంగా ఉంది. బాబ్లీ గ్రామంలోనే నీళ్లు లేవు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్.ఆర్.ఎస్.పి. నింపితే బ్యాక్ వాటర్ ద్వారా తమ గ్రామాలకు ఎంతో కొంత మేలు కలిగే వాతావరణం ఉంది” అని వారు వివరించారు.

పక్కపక్కనే తమ గ్రామాలున్నప్పటికీ రెండు రాష్ట్రాల్లో ఎంతో తేడా ఉంది. తెలంగాణలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి కాబట్టి, తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని గతంలో ధర్మాబాద్ తాలూకాకు చెందిన 40 గ్రామాల ప్రజలు తీర్మానం చేశామని వారు చెప్పారు. దీంతో అప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామాల అభివృద్ధికి 40 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించిందన్నారు. తక్షణం 12 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు కూడా చెప్పారు. కానీ నేటికీ ఒక్క రూపాయి రాలేదన్నారు. “ఈ పరిస్థితుల నేపథ్యంలో ఐదు నియోజకవర్గాలకు చెందిన గ్రామాల్లో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన కార్యక్రమాలు అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలా అమలు చేయలేని పక్షంలో మా గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరుతున్నాం. ఈ డిమాండుతోనే ఉద్యమం చేస్తాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం. కేసీఆర్ అవకాశం కల్పిస్తే టిఆర్‌ఎస్ పార్టీ టికెట్ పైనే ఎన్నికల్లో పోటీ చేస్తాం” అని వారు ప్రకటించారు. నిజాం కాలంలో తామంతా హైదరాబాద్ రాజ్యంతోనే ఉన్నామని, ఇప్పటికీ నిజాం ఖాస్రాపాణీలతోనే భూ రికార్డులు సరిచూసుకుంటున్నామని, తమ గ్రామాల్లోనూ బతుకమ్మ, బోనాల పండుగ నిర్వహిస్తామని వారు వెల్లడించారు.

తెలంగాణ ప్రజలతో తమకు తరతరాల అనుబంధం ఉంది కాబట్టి, తమ గ్రామాలను తెలంగాణలో కలపాలనే డిమాండు సహేతుకమైనదని వారు అభిప్రాయపడ్డారు. త్వరలోనే ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్, బిజెపి, శివసేన, ఎన్‌సిపి తదితర పార్టీలకు చెందిన స్థానిక నాయకులతో కలిసి వచ్చి కెసిఆర్‌ను కలుస్తామని వారు వెల్లడించారు. నాందేడ్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ప్రజలతో పాటు, బీవండి, షోలాపూర్, రజూర తదితర ప్రాంతాల నుంచి కూడా టిఆర్‌ఎస్ టికెట్ కావాలని అడుగుతున్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కెసిఆర్ వెల్లడించారు.

telangana welfare schemes in maharashtra

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మహా తెలంగాణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.