జకీర్‌ను అప్పగించమని మోడీ అడగలేదు

కౌలాలంపూర్: అక్రమ నగదు లావాదేవీలు, ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నాయనే ఆరోపణలున్న, భారతదేశం కోరుకునే జకీర్ నాయక్‌ను తమ దేశానికి అప్పగించమని భారత ప్రధాని నరేంద్రమోడీ తమను అడగలేదని మలేసియా ప్రధాని మహాతిర్ మొహ్మద్ మంగళవారం చెప్పారు.తీవ్రవాదాన్ని బోధిం చే ఆ వ్యక్తిని ఎక్కడికి పంపించాలా అని తమ దేశం ఆలోచిస్తోందని ఆయన తెలిపారు. టీవీలో తీవ్రవాద భావాలను బోధించే 53 ఏళ్ల నాయక్ 2016లో భారతదేశాన్ని వదిలి వెళ్లాడు. ఆ తర్వాత ముస్లింలు ఎక్కువగా ఉండే మలేసియా […] The post జకీర్‌ను అప్పగించమని మోడీ అడగలేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కౌలాలంపూర్: అక్రమ నగదు లావాదేవీలు, ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నాయనే ఆరోపణలున్న, భారతదేశం కోరుకునే జకీర్ నాయక్‌ను తమ దేశానికి అప్పగించమని భారత ప్రధాని నరేంద్రమోడీ తమను అడగలేదని మలేసియా ప్రధాని మహాతిర్ మొహ్మద్ మంగళవారం చెప్పారు.తీవ్రవాదాన్ని బోధిం చే ఆ వ్యక్తిని ఎక్కడికి పంపించాలా అని తమ దేశం ఆలోచిస్తోందని ఆయన తెలిపారు. టీవీలో తీవ్రవాద భావాలను బోధించే 53 ఏళ్ల నాయక్ 2016లో భారతదేశాన్ని వదిలి వెళ్లాడు. ఆ తర్వాత ముస్లింలు ఎక్కువగా ఉండే మలేసియా చేరాడు. అక్కడ అతను శాశ్వతంగా ఉండేందుకు అనుమతించారు. ‘అతను (నాయక్) మా జాతీయుడు కాడు. బహుశ గత ప్రభుత్వం అతని శాశ్వత పౌరుడి హోదా ఇచ్చి ఉండవచ్చు.

శాశ్వాత పౌరుడెవరూ ఈ దేశ విధానాల లు, రాజకీయాల గురించి వ్యాఖ్యానించకూడదు. కానీ, దాన్ని అతను ఉల్లంఘించాడు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడ్డానికి మేం ఒప్పుకోం’ అని మహాతిర్ స్పష్టం చేశారు. ఈ నెలారంభంలో రష్యాలో ఆర్థిక సమాఖ్య సమావేశంలో తను, మోడీ కలుసుకున్నామని మలేసియా ప్రధాని అన్నారు. అయితే, ఢిల్లీ నుంచి అధికారికంగా నోటీస్ అందినా… వివాదాస్పదమైన ఇస్లాం బోధకుడు జకీర్ నాయక్‌ను భారతదేశానికి అప్పగించమని ప్రధాని మోడీ అభ్యర్థించలేదని మహాతిర్ చెప్పారు. ‘చాలా దేశాలు అతన్ని అప్పగించమని చెప్పలేదు. నేను మోడీని కలిశాను. కానీ ఆయన అతన్ని అప్పగించమని నన్ను అడగలేదు’ అన్నారు. మహాతిర్‌తో మోడీ సమావేశం గురించి చెబుతూ విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే ….నాయక్‌ను భారతదేశానికి అప్పగించే అంశాన్ని మోడీ మహాతిర్ వద్ద ప్రస్తావించారని చెప్పారు.

Modi didnt ask me to return Zakir Naik to India

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జకీర్‌ను అప్పగించమని మోడీ అడగలేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: