యోగా నేర్పే యాప్‌లు!

  యోగాని జీవితంలో భాగం చేసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు మనందరికి రావు. సాఫీగా జీవితం సాగిపోతుంది. అయితే, యోగా చేయాలంటే కచ్చితంగా క్లాసులకి వెళ్లాలి. సమయం లేదు. అంటూ సమాధానాలు కాకుండా.. ఇంట్లోనే ఎంచక్కా యోగా చేయొచ్చు. అందుకోసం మనకి ఉపయోగపడే కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి. బ్రీత్ యాప్ : యోగా చేసే ముందు శ్వాస తీసుకుని, వదలడం చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల ఆసనాల్లో ఎక్కువ సేపు ఉండగలుగుతాం..అందుకోసం ఈ బ్రీత్ యాప్ […] The post యోగా నేర్పే యాప్‌లు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

యోగాని జీవితంలో భాగం చేసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు మనందరికి రావు. సాఫీగా జీవితం సాగిపోతుంది. అయితే, యోగా చేయాలంటే కచ్చితంగా క్లాసులకి వెళ్లాలి. సమయం లేదు. అంటూ సమాధానాలు కాకుండా.. ఇంట్లోనే ఎంచక్కా యోగా చేయొచ్చు. అందుకోసం మనకి ఉపయోగపడే కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి.

బ్రీత్ యాప్ : యోగా చేసే ముందు శ్వాస తీసుకుని, వదలడం చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల ఆసనాల్లో ఎక్కువ సేపు ఉండగలుగుతాం..అందుకోసం ఈ బ్రీత్ యాప్ ఉపయోగపడుతుంది. ఇందులో.. శ్వాస ఎంతసేపు తీసుకోవాలి. అనేవి స్పష్టంగా ఉంటాయి. అంతేనా.. రోజూ మనం అనుకున్న సమయానికి యోగా చేయొచ్చని ఈ యాప్ సూచిస్తుంది.

యోగా గో యాప్: ఈ యాప్‌లో ఫిట్‌నెస్‌తో పాటు అధిక బరువు నియంత్రించుకోవడానికి నియమాలు కూడా ఉంటాయి. ఏడు నిమిషాల నుంచి మొదలై 30 నిమిషాల వరకు యోగా చేసేలా ఉంటుంది. సమయం తక్కువగా ఉన్నప్పుడు కేవలం ఐదు నిమిషాల్లోనే చేసే యోగాసనాల గురించి ఈ యాప్ పూర్తి సమాచారం ఇస్తుంది. ఇందులోని ఆసనాలన్నీ ఆరోగ్యాన్నివ్వడమే కాకుండా శరీరాన్ని చురుగ్గా ఉంచుతాయి.

పాకెట్ యాప్ : యోగాసనాలు వేయడంలో ఎన్నో సూచనలు ఇచ్చే ఈ యాప్.. ఏ భంగిమ ఎలా వేయాలో.. దాని వల్ల కలిగే లాభాలేంటో సూచిస్తుంది.

యోగా వేవ్ : ఈ యాప్ అప్పుడే యోగా నేర్చుకునేవారి నుంచి నిష్ణాతులైనవారి వరకూ అందరికీ చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులోని నియమాలు పాటిస్తే శరీరం చక్కగా.. ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది.

Healthy Life with Yoga

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post యోగా నేర్పే యాప్‌లు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: