మాయావతిని ముంచిన రాజస్థాన్ బిఎస్‌పి ఎమ్మెల్యేలు

జైపూర్: బిఎస్‌పి అధినేత్రి మాయావతికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బిఎస్‌పికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు సోమవారం రాజస్థాన్‌లోని అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో 200 మంది సభ్యుల రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్యాబలం 106కు పెరిగింది. వచ్చే నవంబర్‌ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ చేరికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గత కొంతకాలంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో సంప్రదింపులు జరుపుతున్న బిఎస్‌పి ఎమ్మెల్యేలు సోమవారం అసెంబ్లీ స్పీకర్ సిపి జోషిని కలుసుకుని […] The post మాయావతిని ముంచిన రాజస్థాన్ బిఎస్‌పి ఎమ్మెల్యేలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

జైపూర్: బిఎస్‌పి అధినేత్రి మాయావతికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బిఎస్‌పికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు సోమవారం రాజస్థాన్‌లోని అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో 200 మంది సభ్యుల రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్యాబలం 106కు పెరిగింది. వచ్చే నవంబర్‌ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ చేరికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

గత కొంతకాలంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో సంప్రదింపులు జరుపుతున్న బిఎస్‌పి ఎమ్మెల్యేలు సోమవారం అసెంబ్లీ స్పీకర్ సిపి జోషిని కలుసుకుని కాంగ్రెస్‌లో చేరాలన్న తమ నిర్ణయాన్ని లిఖితపూర్వకంగా అందచేశారు. బిఎస్‌పి ఎమ్మెల్యేలు మొత్తం ఆరుగురు ఉండగా అందరూ కాంగ్రెస్‌లో చేరిపోవడంతో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వారికి వర్తించే అవకాశం లేదు. గత ఏడాది జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లు గెలుచుకోగా బిజెపికి 72 స్థానాలు దక్కాయి. బిఎస్‌పికి చెందిన ఆరుగురితో పాటు 12 మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల మద్దతు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
Mayawati Loses All 6 MLAs In Rajasthan, Big Gain For Congress
The Bahujan Samaj Party (BSP) MLAs, who had been in touch with Rajasthan Chief Minister Ashok Gehlot, met Assembly Speaker CP Joshi and submitted a letter informing him about their decision to join the Congress

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మాయావతిని ముంచిన రాజస్థాన్ బిఎస్‌పి ఎమ్మెల్యేలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: