నాంపల్లిలో ఆటో బోల్తా …ఏడుగురు విద్యార్థులకు గాయాలు

హైదరాబాద్ : నగరంలోని నాంపల్లిలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళుతున్న ఆటో బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో బొగ్గులకుంటలోని ఆదిత్య ఆస్పత్రికి తరలించారు. ఓ బాలుడు యాక్టివాపై వేగంగా వెళుతూ ఆటోను ఢీకొట్టాడు. యాక్టివాను తప్పించబోయేందుకు డ్రైవర్ యత్నించిన క్రమంలో అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. గాయపడిన విద్యార్థులు అబిడ్స్ గ్రామర్ పాఠశాలలో చదువుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు […] The post నాంపల్లిలో ఆటో బోల్తా … ఏడుగురు విద్యార్థులకు గాయాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : నగరంలోని నాంపల్లిలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళుతున్న ఆటో బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో బొగ్గులకుంటలోని ఆదిత్య ఆస్పత్రికి తరలించారు. ఓ బాలుడు యాక్టివాపై వేగంగా వెళుతూ ఆటోను ఢీకొట్టాడు. యాక్టివాను తప్పించబోయేందుకు డ్రైవర్ యత్నించిన క్రమంలో అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. గాయపడిన విద్యార్థులు అబిడ్స్ గ్రామర్ పాఠశాలలో చదువుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Road Accident In Nampally At Hyderabad On Today

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నాంపల్లిలో ఆటో బోల్తా … ఏడుగురు విద్యార్థులకు గాయాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: