రైతు బంధు పథకాన్ని పక్కాగా అమలు చేస్తున్నాం : నిరంజన్ రెడ్డి

హైదరాబాద్ : రైతుబంధు పథకాన్ని రాష్ట్రంలో పక్కాగా అమలు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అసెంబ్లీలో నిరంజన్ రెడ్డి మాట్లాడారు.  రైతు బంధు పథకం  కింద ఈ ఏడాది 56.76 లక్షల మంది రైతులు అర్హులుగా ఉన్నారని ఆయన చెప్పారు.  ఇప్పటి వరకు రూ. 39.72 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామని ఆయన స్పష్టం చేశారు. ఇంకా […] The post రైతు బంధు పథకాన్ని పక్కాగా అమలు చేస్తున్నాం : నిరంజన్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : రైతుబంధు పథకాన్ని రాష్ట్రంలో పక్కాగా అమలు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అసెంబ్లీలో నిరంజన్ రెడ్డి మాట్లాడారు.  రైతు బంధు పథకం  కింద ఈ ఏడాది 56.76 లక్షల మంది రైతులు అర్హులుగా ఉన్నారని ఆయన చెప్పారు.  ఇప్పటి వరకు రూ. 39.72 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామని ఆయన స్పష్టం చేశారు. ఇంకా రైతు బంధు అందని రైతులకు చెల్లింపులు ప్రాసెస్‌లో ఉన్నాయని ఆయన చెప్పారు. 2018లో రైతుబంధు పథకం కింద రూ.10,505 కోట్లు చెల్లించామన్నారు. ప్రతి ఎకరానికి ఏడాదికి రూ.10 వేలు ఇస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద పలు షరతులు విధించారని, ఈ పథకంలో భాగంగా రూ.6 వేలను మూడు సార్లు ఇస్తున్నారని ఆయన తెలిపారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 33 లక్షల మంది రైతులను మాత్రమే అర్హులుగా నిర్ణయించారని, అయితే 75 వేల మంది రైతులకు రూ.125 కోట్లను మాత్రమే కేంద్రం మంజూరు చేసిందని ఆయన వెల్లడించారు. గుంట భూమి ఉన్న రైతుకు కూడా రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నామని ఆయన తేల్చి చెప్పారు. గడిచిన ఏడాది రైతు బంధు పథకం కింద రూ.10,505 కోట్లు రైతులకు చెల్లించినట్టు ఆయన చెప్పారు. ఆసరా పింఛన్లు పొందే రైతులు కూడా ఉన్నారని ఆయన తెలిపారు.

Minister Niranjan Reddy Comments On Rythu Bandhu

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రైతు బంధు పథకాన్ని పక్కాగా అమలు చేస్తున్నాం : నిరంజన్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: