అగ్రకుల మహిళతో అక్రమ సంబంధం: దళిత యువకుడి సజీవదహనం

హర్దోయ్(ఉత్తర్ ప్రదేశ్):ఆగ్రకులానికి చెందిన ఒక మహిళతో అక్రమ సంబంధం ఉందన్న కారణంతో ఒక 20 ఏళ్ల దళిత యువకుడిని కొందరు సజీవ దహనం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ఒక 19 సంవత్సరాల మహిళతోపాటు ఆమె బంధువులు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అభిషేక్ అనే ఆ దళిత యువకుడికి గత కొన్ని సంవత్సరాలుగా ఒక మహిళతో అక్రమ సంబంధం ఉంది. గత శనివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి వైద్యం రూ. 25,000 అప్పు […] The post అగ్రకుల మహిళతో అక్రమ సంబంధం: దళిత యువకుడి సజీవదహనం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హర్దోయ్(ఉత్తర్ ప్రదేశ్):ఆగ్రకులానికి చెందిన ఒక మహిళతో అక్రమ సంబంధం ఉందన్న కారణంతో ఒక 20 ఏళ్ల దళిత యువకుడిని కొందరు సజీవ దహనం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ఒక 19 సంవత్సరాల మహిళతోపాటు ఆమె బంధువులు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అభిషేక్ అనే ఆ దళిత యువకుడికి గత కొన్ని సంవత్సరాలుగా ఒక మహిళతో అక్రమ సంబంధం ఉంది. గత శనివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి వైద్యం రూ. 25,000 అప్పు చేసి తిరిగి వస్తున్న అభిషేక్‌ను కొందరు వ్యక్తులు ఒక గదిలో బంధించారు. అతని వద్ద నుంచి డబ్బును లాక్కుని, అతనికి నిప్పు పెటి,్ట గది బయట గొళ్లెం పెట్టి పారిపోయారు. అభిషేక్ ఆర్తనాదాలు విన్న ఇరుగుపొరుగు వారు వచ్చి గది తలుపు తెరచి చూడగా మంటల్లో కాలిపోతున్న అతను కనిపించాడు. వెంటనే అభిషేక్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. కొడుకు మరణవార్త విన్న తల్లి కూడా ఆసుపత్రిలో మరణించింది. పాతకక్షలతోనే అభిషేక్ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Dalit Man Burnt Alive on Relation with Upper-Caste Woman, The incident took place on Saturday night in Uttar Pradeshs Hardoi district

The post అగ్రకుల మహిళతో అక్రమ సంబంధం: దళిత యువకుడి సజీవదహనం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: