కోడెలను మానసికంగా వేధించి చంపారు: చంద్రబాబు

హైదరాబాద్: కోడెలను మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా వేధించి చంపారని టిడిపి అధినేత, ఎపి మాజీ సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కోడెల శివప్రసాదరావు సోమవారం ఉదయం తన నివాసంయలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా కోడెల మృతిపై చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. దేశ చరిత్రలో ఓ సీనియర్ నేత ఆత్మహత్య చేసుకోవడం ఇదే తొలిసారి అని అన్నారు. కోడెలకు పల్నాటిపులిగా గుర్తింపు ఉందని, అలాంటి వ్యక్తికి ఇలాంటి ముగింపు రావడం బాధాకరమన్నారు. ఫర్నీచర్ తీసుకెళ్లాలని అసెంబ్లీ కార్యదర్శికి […] The post కోడెలను మానసికంగా వేధించి చంపారు: చంద్రబాబు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: కోడెలను మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా వేధించి చంపారని టిడిపి అధినేత, ఎపి మాజీ సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కోడెల శివప్రసాదరావు సోమవారం ఉదయం తన నివాసంయలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా కోడెల మృతిపై చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. దేశ చరిత్రలో ఓ సీనియర్ నేత ఆత్మహత్య చేసుకోవడం ఇదే తొలిసారి అని అన్నారు. కోడెలకు పల్నాటిపులిగా గుర్తింపు ఉందని, అలాంటి వ్యక్తికి ఇలాంటి ముగింపు రావడం బాధాకరమన్నారు. ఫర్నీచర్ తీసుకెళ్లాలని అసెంబ్లీ కార్యదర్శికి కోడెల నాలుగు లేఖలు రాసిన స్పందించలేదన్నారు.  కేసులు, వేధింపులతో కోడెల కుంటుంబాన్ని చెల్లచెదురు చేశారన్నారు. కోడెలకు వ్యతిరేకంగా కేసులు వేయాలని ట్వీట్టర్ లో, పేపర్ లో విజయ సాయిరెడ్డి ప్రకటనలు చేశారని, సాక్షి పేపర్ లో పదేపదే కోడెలను విమర్శిస్తూ రాశారన్నారు. మొత్తం రూ.43వేల కోట్లు దోచుకొని, 11 ఛార్జీసీటు కేసుల్లో జగన్ ముద్దాయి అని, కేవలం లక్ష, లక్షన్నర ఫర్నిచర్ విషయంలో కేసులు వేయడం శోచనీయమన్నారు. వైసిపిది టెర్రరిస్టుల ప్రభుత్వమే కాదు… అంతకంటే ఎక్కవ అని మండిపడ్డారు. వైసిపి ప్రభుత్వం ఉన్మాదిలా ప్రవర్తిస్తుందని, ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేందుకే ప్రజావేదికను కూల్చి, నా ఇంటిని ముంచాలని ప్రయత్నించారని ఆరోపించారు. మొత్తం వ్యవహారంపై సిబిఐ విచారణ జరపాలని ఈ సందర్భంగా చంద్రబాబు డిమాండ్ చేశారు.

Chandrababu press meet on Kodela Sivaprasad rao death

The post కోడెలను మానసికంగా వేధించి చంపారు: చంద్రబాబు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: