315 అడుగుల లోతులో బోటు ఆచూకీ

మన తెలంగాణ/హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మం డలం కచ్చులూరు ప్రాంతంలో గోదావరిలో జరిగిన బోటు (లాంచీ) మునిగిపోయిన వి షాద ఘటనలో తెలంగాణకు చెందిన 35 మంది పర్యాటకులలో 13మంది సురక్షింతంగా ఉండగా, 4గురు మృత్యువాత పడ్డా రు. అలాగే 13 మంది గల్లంతయ్యారు. స హాయ బృందాలు సోమవారం నాడు చేపట్టిన గాలింపు చర్యల్లో నాలుగు మృత దేహా లు లభ్యమయ్యాయి. దీంతో మృతుల సం ఖ్య 12కి చేరుకుంది. ఈ నేపథ్యంలో గల్లంతైన […] The post 315 అడుగుల లోతులో బోటు ఆచూకీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మం డలం కచ్చులూరు ప్రాంతంలో గోదావరిలో జరిగిన బోటు (లాంచీ) మునిగిపోయిన వి షాద ఘటనలో తెలంగాణకు చెందిన 35 మంది పర్యాటకులలో 13మంది సురక్షింతంగా ఉండగా, 4గురు మృత్యువాత పడ్డా రు. అలాగే 13 మంది గల్లంతయ్యారు. స హాయ బృందాలు సోమవారం నాడు చేపట్టిన గాలింపు చర్యల్లో నాలుగు మృత దేహా లు లభ్యమయ్యాయి. దీంతో మృతుల సం ఖ్య 12కి చేరుకుంది. ఈ నేపథ్యంలో గల్లంతైన వారి కోసం బాధితుల కుటుంబ సభ్యు లు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్ర మాదం నుంచి ప్రాణాలతో బయటపడిన 23 మంది రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం తక్షణమే స్పందించడంతో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ధవళేశ్వరం వద్ద గేట్లు మూసివేసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మత్స్యకారులు బోట్లతో గోదావరిలో గాలింపు జరుపుతున్నారు. లాంచీ ప్రమాదంలో గల్లంతైన వ్యక్తుల ఆచూకీ కోసం కాటన్ బ్రిడ్జి వద్ద వలల వేయించారు.

మరోవైపు ధవళేశ్వరం వద్ద కుండ పోతగా వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.కచ్చులూరులో గోదావరి నదిలో గల్లంతైన బోటు ఆచూకీ దొరికింది. మంగళవారం బోటు నుంచి మృతదేహాలను వెలికితీసే అవకాశం ఉంది. బోటు బయటకు తీస్తేగానీ అందులో ఎంతమంది చిక్కుకుపోయారనేది తెలియనుంది. కాగా, రెండో రోజూ మృతదేహాలు లభ్యమవలేదు. గల్లంతైన వారికోసం గోదావరిలో ఇంకా గాలింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 12 మృతదేహాలు వెలికితీశారు. మృతదేహాలను వారి వారి కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించారు. ఇంకా 39 మంది పర్యాటకుల ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది. పాపికొండల టూర్‌లో బోటు ముంపు ప్రమాద ఘటనలో ఇవాళ నాలుగు మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీసి పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వర్షం అధికం కావడం, చీకటి పడటంతో సోమవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో గాలింపు చర్యలను అధికారులు ఆపేశారు. బుధవారం ఉదయం మళ్లీ గాలింపు చర్యలు మొదలు పెట్టనున్నారు అధికారులు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఏపీ సీఎం జగన్ ఇవాళ ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించారు. 315 అడుగుల లోతులో లాంచీ మునిగినట్లు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు గుర్తించాయి.

కాగా నిబంధనలకు విరుద్ధంగా బోటు నడిపి.. ప్రమాదానికి కారణమైన ప్రయివేటు టూరిజానికి చెందిన రాయల్ వశిష్ట పున్నమి బోటు నిర్వాహకుడు కోడిగుడ్ల వెంకటరమణపై దేవీపట్నం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. నిబంధనలు పాటించకుండా బోటు నడిపి ప్రమాదానికి కారణమయ్యారని విశాఖపట్నానికి చెందిన వెంకటరమణపై దేవీపట్నం తహసీల్దార్ మహబూబ్‌అలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకురంపచోడవరం సిఐ వెంకటేశ్వరరావు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిబంధల ప్రకారం బోటులో 60 మంది పర్యటకులతో పాటు 5 మంది సిబ్బంది ప్రయాణించాల్సి ఉండగా.. 71 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. బోటు తనిఖీ జరిగే దేవీపట్నం పోలీస్‌స్టేషన్ వద్దకు రాగానే పర్యటకులు అందరూ లైఫ్‌జాకెట్లు ధరించి ఉన్నారు. స్టేషన్ దాటాక వాటిని తీసేశారు. ఇక్కడే సిబ్బంది పర్యాటకులను కట్టడిచేయాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రమాదం జరిగిందని నిర్థారించారు.
బాధితులకు ఎపి సిఎం పరామర్శ
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో ఆదివారం జరిగిన బోటు (లాంచీ) ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. సోమవారం ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లారు. లాంచీ ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతాన్ని రెస్క్యూ ఆపరేషన్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న సీఎం వైయస్ జగన్ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఒకొక్క బాధితుడి దగ్గరకు వెళ్లి పరామర్శించి ప్రమాద ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. సిఎం జగన్ వెంట తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, తదితరులు ఉన్నారు.గోదావరి ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి 35 మంది పర్యాటకులలో 13మంది సురక్షింతంగా ఉండగా, 4గురు మృత్యువాత పడ్డారు. అలాగే 13 మంది గల్లంతయ్యారు. కాగా మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పడ్తాన్ పల్లి గ్రామానికి చెందిన బొడ్డు లక్ష్మణ్, కర్ణమామిడి గ్రామానికి చెందిన రమ్య గల్లంతు కాగా వారి ఆచూకీ కోసం గజఈతగాళ్లు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Boat Found at a depth of 315 feet in Godavari

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 315 అడుగుల లోతులో బోటు ఆచూకీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.