విద్యుత్ షాక్‌తో ముగ్గురు రైతుల మృతి

మన తెలంగాణ/మాచారెడ్డి:విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు రైతులు మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఎల్పుగొండ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని ఎల్పుగొండ గ్రామానికి చెందిన వేముల స్వామి అనే వ్యక్తి పొలంలోని బోరు మోటారు పాడైపోయింది. ఇట్టి మోటారును రిపేరు చేయించడానికి బోరుబావిలో ఉన్న బోరు మోటారును రిపేరు చేయిస్తానని ఎల్పుగొండ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను తీసుకొని పొలంలోని బోరు మోటారును పైకి లేపుతుండగా వ్యవసాయ పొలంలోని 11 కెవి విద్యుత్ […] The post విద్యుత్ షాక్‌తో ముగ్గురు రైతుల మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/మాచారెడ్డి:విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు రైతులు మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఎల్పుగొండ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని ఎల్పుగొండ గ్రామానికి చెందిన వేముల స్వామి అనే వ్యక్తి పొలంలోని బోరు మోటారు పాడైపోయింది. ఇట్టి మోటారును రిపేరు చేయించడానికి బోరుబావిలో ఉన్న బోరు మోటారును రిపేరు చేయిస్తానని ఎల్పుగొండ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను తీసుకొని పొలంలోని బోరు మోటారును పైకి లేపుతుండగా వ్యవసాయ పొలంలోని 11 కెవి విద్యుత్ వైర్లకు పైపులు తగలడం వలన విద్యుత్ షాక్‌కు గురై ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారు ఎలేని మురళీధర్‌రావు (55), ఇమిడి సత్యనారాయణ (51), అమినేని లక్ష్మణ్‌రావు (62) ముగ్గురు కూడా ఎల్పుగొండ గ్రామానికి చెందిన వారే. వీరి మృతితో ఎల్పుగొండ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఒకేసారి ముగ్గరు మృతి చెందడం మరియు ముగ్గురు ఒకే గ్రామానికి చెందిన వారు అవడం వలన మృతుల కుటుంబసభ్యుల రోదనలు కంటతడి పెట్టించాయి. ఎస్సై మురళీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Three farmers died due to electric shock

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post విద్యుత్ షాక్‌తో ముగ్గురు రైతుల మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.