డ్రోన్ దాడుల ట్రంప్ ఫైర్

వాషింగ్టన్ : సౌదీలోని కీలక చమురు క్షేత్రాలపై దాడులకు దిగిన వారిని శిక్షించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అసాధారణ రీతిలో జరిగిన డ్రోన్ దాడులపై తీవ్రంగా స్పందించాల్సి వస్తోందని, ఇందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ తెలిపారు. తాము లాక్డ్ అండ్ లోడెడ్ అని ప్రకటించారు. ఇరాన్ చేష్టలతోనే ఇప్పటి డ్రోన్ దాడులు జరిగాయని ఒక్కరోజు క్రితమే అమెరికా దౌత్యవేత్త ఒకరు స్పందించారు. గల్ఫ్ అంతర్యుద్ధం నాటి నుంచి ముడిచమురు […] The post డ్రోన్ దాడుల ట్రంప్ ఫైర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.


వాషింగ్టన్ : సౌదీలోని కీలక చమురు క్షేత్రాలపై దాడులకు దిగిన వారిని శిక్షించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అసాధారణ రీతిలో జరిగిన డ్రోన్ దాడులపై తీవ్రంగా స్పందించాల్సి వస్తోందని, ఇందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ తెలిపారు. తాము లాక్డ్ అండ్ లోడెడ్ అని ప్రకటించారు. ఇరాన్ చేష్టలతోనే ఇప్పటి డ్రోన్ దాడులు జరిగాయని ఒక్కరోజు క్రితమే అమెరికా దౌత్యవేత్త ఒకరు స్పందించారు. గల్ఫ్ అంతర్యుద్ధం నాటి నుంచి ముడిచమురు ధరలు పెరుగుతూ ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ట్రంప్ నుంచి ఈ దాడుల పట్ల తీవ్ర స్పందన వెలువడింది. శనివారం నాడు సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ చమురు శుద్ధి కర్మాగారాలను లక్షంగా చేసుకుని యెమెన్ హైతీ రెబెల్స్ దాడులు సాగించారు. దీనితో ప్రపంచ దేశాలకు సౌదీనుంచి చమురు సరఫరాలు సగం తగ్గాయి.

Donald Trump Fires On Drone Attack in Saudi Arabia

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post డ్రోన్ దాడుల ట్రంప్ ఫైర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.