పవార్‌వి ఓటు బ్యాంక్ రాజకీయాలు

 మహారాష్ట్ర సిఎం ఫణ్నవీస్ ఆయన మాటల్ని వక్రీకరించారు: ఎన్‌సిపి పుణె/ముంబయి: పాకిస్థాన్‌పై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్‌పవార్ చేసిన వ్యాఖ్య రాజకీయ దుమారానికి కేంద్రంగా మారింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పవార్ వ్యాఖ్యను ఓటు బ్యాంక్ రాజకీయాలతో ముడిపెట్టారు. మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికలు జరగాల్సి ఉంది. భారతదేశంలో అనుకుంటున్నట్టు పాకిస్థాన్‌లో ప్రజలు దిగులుగాలేరని, అక్కడికి వెళ్లినప్పుడు తనకు ఆప్యాయంగా స్వాగతం పలికారనీ పవార్ తాజా గా వ్యాఖ్యానించారు. ‘మహాజనదేశ్ యాత్ర’ […] The post పవార్‌వి ఓటు బ్యాంక్ రాజకీయాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 మహారాష్ట్ర సిఎం ఫణ్నవీస్
ఆయన మాటల్ని వక్రీకరించారు: ఎన్‌సిపి

పుణె/ముంబయి: పాకిస్థాన్‌పై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్‌పవార్ చేసిన వ్యాఖ్య రాజకీయ దుమారానికి కేంద్రంగా మారింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పవార్ వ్యాఖ్యను ఓటు బ్యాంక్ రాజకీయాలతో ముడిపెట్టారు. మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికలు జరగాల్సి ఉంది. భారతదేశంలో అనుకుంటున్నట్టు పాకిస్థాన్‌లో ప్రజలు దిగులుగాలేరని, అక్కడికి వెళ్లినప్పుడు తనకు ఆప్యాయంగా స్వాగతం పలికారనీ పవార్ తాజా గా వ్యాఖ్యానించారు. ‘మహాజనదేశ్ యాత్ర’ చివ రి అంకంలో భాగంగా సతారా జిల్లా కరాద్‌లో ఫడ్నవీస్ విలేకరులతో మాట్లాడారు. బడా నాయకులు మాట్లాడేముందు తమ ప్రకటనలు ఉపయోగపడుతున్నది భారతదేశానికా లేక పాకిస్థాన్‌కా అన్నది ఆలోచించాలని మహా సిఎం సలహా ఇచ్చారు. ఎన్నికలు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ ఓట్లకోసం ఇలాంటి ప్రకటనలు చేయడం మంచిది కాదు .భారతదేశంలో ఉండే ముస్లింలు తాము ఇక్కడ ఉన్నందుకు గర్వపడుతుంటారు. ఇలాంటి ప్రకటనలు చేస్తే ముస్లింలు తనకు (ఎన్‌సిపి) ఓటేస్తారని పవార్ అనుకుంటుంటే…ఆ ఆలోచనే వారికి అన్యాయం చేస్తుంది’ అని ఫడ్నవీస్ విమర్శించారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేయడంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యల్ని పాకిస్థాన్ ఇండియాను విమర్శించేందుకు వాడుకుందని ఫడ్నవీస్ గుర్తు చేశారు. ఇలా ఉండగా, పార్టీ అధినేత శరద్ పవార్‌పై గురిచూసి ఫడ్నవీస్ చేసిన దాడిని ఎన్‌సిపి తిప్పికొట్టింది. ‘రాష్ట్ర ముఖ్యమంత్రికన్నా పవార్‌కు దేశ ప్రయోజనాలేమిటో బాగా తెలుసు. పవార్ మాటల్ని ఫడ్నవీస్ వక్రీకరిస్తున్నారు’ అని ఎన్‌సిపి ప్రతినిధి నవాబ్ మాలిక్ చెప్పారు.

cm Devendra Fadnavis Pawar comments On Sharad Pawar

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పవార్‌వి ఓటు బ్యాంక్ రాజకీయాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.