అసెంబ్లీకి చేనేత కళ

కెటిఆర్ పిలుపు మేరకు చేనేత దుస్తులు ధరించిన పలువురు శాసనసభ్యులు మనతెలంగాణ/హైదరాబాద్ : చేనేత రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రతి సోమవారం చేనేత దుస్తులు ధరించాలని గతంలోనే రాష్ట్రపరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ఇచ్చిన పిలుపుమేరకు అసెంబ్లీకి శాసనసభ్యులు దాదాపుగా చేనేత దుస్తులు ధరించి రావడం చేనేతకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహానికి నిదర్శనం. సోమవారం శాసనసభకు సభ్యులు చేనేత దుస్తు లు ధరించివచ్చారు. వారితో పాటు అధికారులు, సిబ్బందికూడా చేనేత దుస్తులు ధరించారు. కెటిఆర్ సిరిసిల్ల […] The post అసెంబ్లీకి చేనేత కళ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కెటిఆర్ పిలుపు మేరకు చేనేత దుస్తులు ధరించిన పలువురు శాసనసభ్యులు

మనతెలంగాణ/హైదరాబాద్ : చేనేత రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రతి సోమవారం చేనేత దుస్తులు ధరించాలని గతంలోనే రాష్ట్రపరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ఇచ్చిన పిలుపుమేరకు అసెంబ్లీకి శాసనసభ్యులు దాదాపుగా చేనేత దుస్తులు ధరించి రావడం చేనేతకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహానికి నిదర్శనం. సోమవారం శాసనసభకు సభ్యులు చేనేత దుస్తు లు ధరించివచ్చారు. వారితో పాటు అధికారులు, సిబ్బందికూడా చేనేత దుస్తులు ధరించారు. కెటిఆర్ సిరిసిల్ల మగ్గాలపై నేచిన గులాబి రంగు షర్ట్ ధరించివచ్చారు. అయితే చేనేత దుస్తులతో రాని శాసన సభ్యులు కెటిఆర్‌ను కలిసేందుకు ఇబ్బందిపడ్డారు. అలాగే శాసనసభలో కెటిఆర్‌ను కలిసేందుకు వచ్చిన వారుకూడా చేనేత దుస్తులు ధరించిరావడం గమనార్హం. కెటిఆర్ మొదటిసారిగా మంత్రిగా బాధ్యతలు నిర్వహించినప్పుడు చేనేత శాఖ కూడా ఆయన ఆధీనంలోనే ఉండేది.

ఈ సందర్భంగా చేనేత కార్మికులకు ఉత్సాహాన్ని, ఉపాధిని కల్పించడంతో పాటు చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీశ్రేణులు, చేనేత రంగంపై అభిమానం ఉన్నవారంతా ప్రతి సోమవారం చేనేత దుస్తులు ధరించాలని పిలుపునిచ్చారు. ఆనాటి నుంచి ఈ సంప్రదాయం అమల్లో ఉంది. కెటిఆర్ అధికారంలో ఉన్నాలేకున్నా ఖచ్చితంగా సోమవారం చేనేతదుస్తులు ధరించడం అలవర్చుకున్నారు. రెండవసారి మంత్రివర్గంలో చేరిన కెటిఆర్ సోమవారం శాసనసభకు చేనేత దుస్తులు ధరించి వచ్చారు. అలాగే ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న ఐటి, పరిశ్రమలు,పట్టణభివృద్ధి, మున్సిపాలిటీ శాఖల అధికారులుకూడా సోమవారం చేనేత దుస్తులు ధరించి విధులు నిర్వహించడం చేనేత రంగానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇస్తున్న గౌరవానికి తార్కాణం.

Some MLAs wearing handlooms

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అసెంబ్లీకి చేనేత కళ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: