టి హబ్-2 ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఇంక్యుబేటర్

మన తెలంగాణ/హైదరాబాద్ : టి హబ్2 ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఇంక్యుబేటర్ కానుందని ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. మొదటి టి హబ్ విజయవంతం కావడంతో ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని నీతి ఆయోగ్, ఆర్‌బిఐ కూడా చెప్పాయని మంత్రి గుర్తుచేశారు. గోవా, ఢిల్లీ, అసోం రాష్ట్రాలకు టెక్నాలజీ సహాకారం అందిస్తున్నామన్నారు. వినూత్న రీతిలో ప్రవేశపెట్టిన టి హబ్‌ను, అంకుర పరిశ్రమలను విస్తరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటని శాసనసభలో సభ్యులు బాల్క సుమన్, […] The post టి హబ్-2 ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఇంక్యుబేటర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.


మన తెలంగాణ/హైదరాబాద్ : టి హబ్2 ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఇంక్యుబేటర్ కానుందని ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. మొదటి టి హబ్ విజయవంతం కావడంతో ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని నీతి ఆయోగ్, ఆర్‌బిఐ కూడా చెప్పాయని మంత్రి గుర్తుచేశారు. గోవా, ఢిల్లీ, అసోం రాష్ట్రాలకు టెక్నాలజీ సహాకారం అందిస్తున్నామన్నారు. వినూత్న రీతిలో ప్రవేశపెట్టిన టి హబ్‌ను, అంకుర పరిశ్రమలను విస్తరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటని శాసనసభలో సభ్యులు బాల్క సుమన్, వివేకానంద ప్రశ్నించారు. వీటికి ఐటి శాఖ మంత్రి కెటిఆర్ సమాధానమిచ్చారు. టి హబ్‌లో 500లకు పైగా అంకుర పరిశ్రమలు ఏర్పడి, 2 వేల మందికి పైగా ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు. రెండో దశలో 2 వేల స్టార్టప్స్, 4 వేల మందికి ఉపాధి కల్పించనున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది మార్చి నాటికి టి హబ్2 నిర్వహణలోకి వస్తుందన్నారు. ఇచ్చిన సమయంలోపే వెయ్యికి పైగా అంకుర పరిశ్రమలు ఏర్పడుతాయన్నారు.

ద్వితీయ శ్రేణి పట్టణాలకు టి హబ్ విస్తరణలో భాగంగా వరంగల్‌లోనూ నూతనంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రూ.33 కోట్లతో కరీంనగర్‌లో ఐటి హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అంకుర పరిశ్రమల్లో గ్రామీణ యువతకు భాగస్వామ్యం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకు ‘ఇంటింటా ఇన్నోవేషన్’, ‘టి వర్క్’ తదితర పేర్లతో కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. రాయదుర్గం ప్రాంతంలో రూ.276 కోట్లతో మూడు ఎకరాల్లో టి హబ్2ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతంలోనే ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ప్రయోగత్మకమైనవి 90 శాతం వరకు ఫెయిల్ అవుతాయని, అలా అయిన వారికి కూడా భవిష్యత్‌లో ఉపయోగపడేందుకు సర్టిఫికేట్‌లు కూడా అందిస్తున్నట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. రిచ్ పేరిట సిసిఎంబి, ఎన్‌ఐన్ పరిశోధనలను కూడా ఉపయోగపడుతున్నట్లు వివరించారు.

T hub 2 second largest incubator in world

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post టి హబ్-2 ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఇంక్యుబేటర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: