కోహ్లీకి అందనంత దూరంలో స్టీవ్ స్మిత్

ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్ దుబాయి: యాషెస్ సిరీస్‌లో చిరస్మరణీయ బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టించిన ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ టెస్టుల్లో తన టాప్ ర్యాంక్‌ను మరింత పదిలం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి సోమవారం తాజాగా ప్రకటించిన టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో స్మిత్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. యాషెస్ సిరీస్ ప్రారంభానికి ముందు స్మిత్ టాప్ ర్యాంక్‌కు చేరుకుంటాడని ఎవరూ ఊహించలేదు. గతంలో అగ్రస్థానంలో ఉన్న స్మిత్ బాల్ టాంపరింగ్ వివాదం నేపథ్యంలో ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా […] The post కోహ్లీకి అందనంత దూరంలో స్టీవ్ స్మిత్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్
దుబాయి: యాషెస్ సిరీస్‌లో చిరస్మరణీయ బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టించిన ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ టెస్టుల్లో తన టాప్ ర్యాంక్‌ను మరింత పదిలం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి సోమవారం తాజాగా ప్రకటించిన టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో స్మిత్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. యాషెస్ సిరీస్ ప్రారంభానికి ముందు స్మిత్ టాప్ ర్యాంక్‌కు చేరుకుంటాడని ఎవరూ ఊహించలేదు. గతంలో అగ్రస్థానంలో ఉన్న స్మిత్ బాల్ టాంపరింగ్ వివాదం నేపథ్యంలో ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఈ సమయంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టుల్లో ఎదురులేని శక్తిగా ఎదిగాడు. వరుస సెంచరీలతో ఎవరికి అందనంత దూరంలో నిలిచాడు. అయితే యాషెస్ సిరీస్ ద్వారా రెండో ఇన్నింగ్స్ చేపట్టిన స్మిత్ అసాధారణ బ్యాటింగ్‌తో టెస్టుల్లో తనదైన ముద్ర వేశాడు. ఏకంగా కోహ్లి టాప్ ర్యాంక్‌కే ఎసరు పెట్టాడు. ప్రారంభంలో ఒక పాయింట్ తేడాతో కోహ్లిని వెనక్కి నెట్టి స్మిత్ టాప్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఈ సమయంలో కోహ్లి మళ్లీ అగ్రస్థానానికి చేరుకోవడం కష్టమేమి కాదని అందరూ భావించారు. అయితే స్మిత్ మాత్రం చారిత్రక బ్యాటింగ్‌తో యాషెస్ సిరీస్‌లో పెను ప్రకంపనలు సృష్టించాడు.

అంతేగాక కోహ్లి కంటే ఏకంగా 34 పాయింట్ల ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. దీంతో సమీప భవిష్యత్తులో స్మిత్‌ను చేరుకోవడం కోహ్లి కష్టంగానే కనిపిస్తోంది. అయితే దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రాణిస్తే మాత్రం స్మిత్‌ను వెనక్కి నెట్టడం కష్టం కాక పోవచ్చు. కోహ్లి ఈ సిరీస్‌లో ఎలా ఆడుతాడనే దానిపైనే ఇది ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం స్మిత్ 937 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లి 903 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా (భారత్) నాలుగో ర్యాంక్‌కు పడి పోయాడు.కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) మూడో, నికోల్స్ (న్యూజిలాండ్) ఐదో ర్యాంక్‌ను సాధించారు. బౌలింగ్‌లో ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ కమిన్స్ నంబర్‌వన్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా స్టార్ రబడా రెండో, భారత సంచలనం బుమ్రా మూడో ర్యాంక్‌ను సాధించారు. టీమ్ విభాగంలో భారత్ నంబర్‌వన్ ర్యాంక్‌ను కాపాడుకుంది.

Steve Smith builds 34point lead over Virat Kohli at the top

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కోహ్లీకి అందనంత దూరంలో స్టీవ్ స్మిత్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.