మొట్టమొదటి మహిళా డిప్యూటీ ఎయిర్ ఎటాచ్‌గా అంజలీ సింగ్

  భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ అంజలి సింగ్ విదేశాలలో ఉన్న ఒక భారతీయ మిషన్‌లో దేశానికి తొలి మహిళా రక్షణ అటాచ్‌గా ఎంపికైంది. ఇప్పటివరకు ఇలాంటి విధుల్లో పురుషులు మాత్రమే ఉన్నారు. మొదటి సారిగా మహిళలకు బాధ్యతలను అప్పజెప్పడం అభినందనీయం. ఐఎఎఫ్ ఆఫీసర్ అంజలి సింగ్ డిఫెన్స్ ఎటాచీకి ఎంపికైన భారతదేశానికి చెందిన మొట్టమొదటి మహిళ. రక్షణ శాఖలో పనిచేస్తున్న వింగ్ కమాండర్ అంజలి మాస్కోకి ఎంబసీగా పనిచేయనుంది. ఈ క్రమంలో డిప్యూటీ […] The post మొట్టమొదటి మహిళా డిప్యూటీ ఎయిర్ ఎటాచ్‌గా అంజలీ సింగ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ అంజలి సింగ్ విదేశాలలో ఉన్న ఒక భారతీయ మిషన్‌లో దేశానికి తొలి మహిళా రక్షణ అటాచ్‌గా ఎంపికైంది. ఇప్పటివరకు ఇలాంటి విధుల్లో పురుషులు మాత్రమే ఉన్నారు. మొదటి సారిగా మహిళలకు బాధ్యతలను అప్పజెప్పడం అభినందనీయం.

ఐఎఎఫ్ ఆఫీసర్ అంజలి సింగ్ డిఫెన్స్ ఎటాచీకి ఎంపికైన భారతదేశానికి చెందిన మొట్టమొదటి మహిళ. రక్షణ శాఖలో పనిచేస్తున్న వింగ్ కమాండర్ అంజలి మాస్కోకి ఎంబసీగా పనిచేయనుంది. ఈ క్రమంలో డిప్యూటీ ఎటాచీగా బాధ్యతలు తీసుకుంది. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ రంగాల్లో సాధారణంగా మగవారే ఇలాంటి వాటికి ఎంపికవుతారు. కానీ తొలిసారి అంజలి ఎంపిక అవడం విశేషం. దీంతో భారతవైమానికి దళం లింగ సమానత్వం వైపు మరో సారి ముందడుగు వేసింది. ఆర్మీ, వైమానిక, నావికా దళం నుంచి ఇప్పటివరకూ అన్ని రక్షణ అటాచ్‌లు మగ అధికారులు మాత్రమే ఉన్నారు.

ఏరోనాటికల్ ఇంజనీరింగ్ శాఖకు చెందిన వింగ్ కమాండర్ అంజలి సింగ్ డిప్యూటీ ఎయిర్ అటాచ్‌గా నియమితురాలవడంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. విదేశాల్లో ఉన్న భారత మిషన్లలో నియామకాలకు మహిళా అధికారులను గుర్తించే ప్రక్రియను నేవే ప్రారంభించింది. మహిళా రక్షణ అటాచ్‌లను నియమించే ప్రక్రియను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు. దేశం సైనిక దౌత్యంలో అటాచెస్ పాత్ర కీలకమైంది. భారతదేశంలో సహా డిప్యూటీలతో సహా రక్షణ అటాచ్‌లున్న 95 దేశాలున్నాయి.

Anjali Singh as the first female Deputy Air Attache

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మొట్టమొదటి మహిళా డిప్యూటీ ఎయిర్ ఎటాచ్‌గా అంజలీ సింగ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: