ఐస్‌ల్యాండ్‌కు వెళ్తున్న ‘డిస్కో రాజా’

  రవితేజ హీరోగా ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘డిస్కో రాజా’. రామ్ తాళ్లూరి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదలకానుంది. తాజాగా గోవాలో 15 రోజులు పాటు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణను పూర్తిచేశారు ఫిల్మ్‌మేకర్స్. రవితేజ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా సినిమా టీమ్ చెప్పింది. ఈ నేపథ్యంలో గోవా షెడ్యూల్ ముగించుకొని ప్రస్తుతం విదేశాలకు వెళ్లేందుకు ‘డిస్కో […] The post ఐస్‌ల్యాండ్‌కు వెళ్తున్న ‘డిస్కో రాజా’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రవితేజ హీరోగా ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘డిస్కో రాజా’. రామ్ తాళ్లూరి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదలకానుంది. తాజాగా గోవాలో 15 రోజులు పాటు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణను పూర్తిచేశారు ఫిల్మ్‌మేకర్స్. రవితేజ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా సినిమా టీమ్ చెప్పింది. ఈ నేపథ్యంలో గోవా షెడ్యూల్ ముగించుకొని ప్రస్తుతం విదేశాలకు వెళ్లేందుకు ‘డిస్కో రాజా’ టీమ్ సిద్ధమవుతున్నట్లు నిర్మాత రామ్ తాళ్లూరి తెలిపారు. యూరప్‌లోని ఐస్‌ల్యాండ్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రకరించడానికి ప్లాన్ చేసినట్లు చెప్పారు. ఈ షెడ్యూల్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లుగా సినిమా టీమ్ చెబుతోంది. దాదాపు 4 నుంచి – 5 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఐస్‌ల్యాండ్‌లో సెప్టెంబర్ 17 నుంచి కొత్త షెడ్యూల్ జరుగనుంది.

ఈ షెడ్యూల్ కోసం హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఫాస్ట్ అండ్ ఫురియెస్ 7’ కోసం పనిచేసిన యాక్షన్ స్టంట్‌మాస్టర్స్‌తో పాటు పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగబోతున్నారు. సినిమాకు హైలైట్‌గా ఈ సన్నివేశాలు ఉండబోతున్నాయని ఫిల్మ్‌మేకర్స్ అంటున్నారు. పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యాహోప్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్‌కి పెద్దపీట వేసి నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్, ఆబ్బూరి రవి డైలాగ్స్, కార్తీక్ ఘట్టమనేని గ్రాండియర్ విజువల్స్, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర పనితనం, నవీన్ నూలి ఎడిటింగ్ ఈ సినిమాకు ఎంతో ప్లస్ అవుతున్నాయి. ఇక వెన్నెల కిషోర్ హిలేరియస్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించనున్నారు. బాబీ సింహా ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం ప్రీ లుక్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది.

Disco raja movie shooting at island

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఐస్‌ల్యాండ్‌కు వెళ్తున్న ‘డిస్కో రాజా’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: