మొక్కలు నాటిన హీరో శ్రీకాంత్

  వనమిత్ర అవార్డు రావడం ఆనందంగా ఉందంటూ ప్రకటన మనతెలంగాణ/హైదరాబాద్: టిఆర్‌ఎస్ నాయకుడు, రాజ్యసభ సభ్యు లు జోగినిపల్లి సంతోష్ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ప్రారంభించిన ‘హరా హైతో భరా హై’ ఛాలెంజ్‌లో భాగంగా చాలామంది ప్రముఖులు మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ ఛాలెంజ్‌లో భాగంగా ఆదివారం హీరో శ్రీకాంత్ వారి ఇంటి ఆవరణలో మూడు మొక్కలునాటారు. అనంతరం మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్‌ని చేశారు. వారిలో హీరో నాని, […] The post మొక్కలు నాటిన హీరో శ్రీకాంత్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వనమిత్ర అవార్డు రావడం ఆనందంగా ఉందంటూ ప్రకటన

మనతెలంగాణ/హైదరాబాద్: టిఆర్‌ఎస్ నాయకుడు, రాజ్యసభ సభ్యు లు జోగినిపల్లి సంతోష్ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ప్రారంభించిన ‘హరా హైతో భరా హై’ ఛాలెంజ్‌లో భాగంగా చాలామంది ప్రముఖులు మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ ఛాలెంజ్‌లో భాగంగా ఆదివారం హీరో శ్రీకాంత్ వారి ఇంటి ఆవరణలో మూడు మొక్కలునాటారు. అనంతరం మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్‌ని చేశారు. వారిలో హీరో నాని, అల్లరి నరేష్‌తో పాటు డైరెక్టర్ ఎస్.వి. కృష్ణారెడ్డికి ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా కోరారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ఎంపి సంతోష్ ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్ళడం చాలా బాగుందన్నారు. ఇందుకు ఆయనను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే గత సంవత్సరం తానునాటిన మొక్కలకుగాను ఈరోజు నాకు హర హైతో భరా హై అవార్డ్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. నాకు సినిమా రంగంలో వచ్చిన అవార్డుల కంటే ఈ అవార్డ్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అలాగే గ్రీన్ ఛాలెంజ్ చేస్తేనే మొక్కలు నాటాలని కాకుండా అందరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

Hero Srikanth Accepted Green Challenge

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మొక్కలు నాటిన హీరో శ్రీకాంత్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: