మలబద్ధకానికి మంచి మందు!

  డ్రైపూట్స్‌లో మన ఆరోగ్యానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చూడటానికి చిన్నవిగా ఉన్నా వాటిలో ఉండే క్యాలరీల శక్తి అధికం ఉంటుంది. ఎండిన పండ్లలో మనకు తెలిసినది ఎండుద్రాక్ష. ఎండు ద్రాక్షలో ఒలెనిక్ అయాసిడ్ ఉన్నందున దంతాలలో ఉన్న బ్యాక్టీరియాను పెరగనివ్వకుండా పళ్ళను రక్షిస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉన్నందున విరేచనం సాఫీగా జరుగుతుంది. మలబద్దకంతో బాధపడేవారు రాత్రిపూట పడుకునేముందు ఎండుద్రాక్షతో పాటు, సోంపును కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. 1. స్త్రీలలో అధిక శాతం […] The post మలబద్ధకానికి మంచి మందు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

డ్రైపూట్స్‌లో మన ఆరోగ్యానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చూడటానికి చిన్నవిగా ఉన్నా వాటిలో ఉండే క్యాలరీల శక్తి అధికం ఉంటుంది. ఎండిన పండ్లలో మనకు తెలిసినది ఎండుద్రాక్ష. ఎండు ద్రాక్షలో ఒలెనిక్ అయాసిడ్ ఉన్నందున దంతాలలో ఉన్న బ్యాక్టీరియాను పెరగనివ్వకుండా పళ్ళను రక్షిస్తుంది.

ఫైబర్ పుష్కలంగా ఉన్నందున విరేచనం సాఫీగా జరుగుతుంది. మలబద్దకంతో బాధపడేవారు రాత్రిపూట పడుకునేముందు ఎండుద్రాక్షతో పాటు, సోంపును కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
1. స్త్రీలలో అధిక శాతం రక్తహీనత కలిగి ఉంటారు. ఎండుద్రాక్ష తీసుకోవడం వల్ల ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్ అందుతాయి. బ్లడ్ కౌంట్ త్వరగా పెరిగే అవకాశం ఉంది. ఇనుము అధికంగా ఉండడం వల్ల రక్తంలోకి త్వరగా చేరుతుంది.
2. ఎండుద్రాక్షలో ఉండే ఫోలిఫినోలిక్ యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో కోలన్ క్యాన్సర్ కారణం అయ్యే టోమర్ సెల్స్‌తో పోరాడే గుణాలు దీనిలో ఎక్కువగా ఉండడంతో క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. దీనిలో గ్లూకోజ్, విటమిన్ల శోషణ ప్రోత్సహించే ఫ్రక్టోజ్‌ను కలిగి వుంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎసిడిటిని తగ్గించే పొటాషియం, మెగ్నీషియం కూడా దీనిలో అధికంగా ఉంటుంది.

3. తరుచుగా తినడం వల్ల శరీరంలో పులుపును స్వీకరించే శక్తిగల ఆమ్లాలను సమానం చేసి జ్వరం రాకుండా చేస్తుంది.ఎండుద్రాక్ష శరీరంలో రక్త కణాలు, హిమోగ్లోబిన్‌ల శాతం పెరగేలా చేస్తాయి. మెదడు, గుండె, నరాలు, ఎముకలు, కాలేయం చక్కగా పనిచేసేలా చేస్తాయి.

Raisins have known to help in Constipation Relief

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మలబద్ధకానికి మంచి మందు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: