మన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు

  ప్రేమలో విఫలమైతే బాధపడకూడదు అని అంటోంది కాజల్ అగర్వాల్. తన వ్యక్తిగత అనుభవమో ఏమోకానీ ఈ భామ ప్రేమ గురించి చాలానే చెప్పింది. “ఈ తరం యువత ప్రేమలో పడడం సర్వసాధారణంగా మారింది. అయితే అందరి ప్రేమ సక్సెస్ కావడం లేదు. అలాగని ప్రేమలో విఫలమైన వారు ఇక జీవితమే లేదని బాధపడకూడదు… అది కరెక్ట్ కాదు. అలాంటి మానసిక వేదన నుంచి బయటపడాలి. ప్రేమించడం… ప్రేమించబడడం సహజం. ప్రేమించుకున్న వాళ్లందరూ పెళ్లి పీటలెక్కడం లేదు. […] The post మన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రేమలో విఫలమైతే బాధపడకూడదు అని అంటోంది కాజల్ అగర్వాల్. తన వ్యక్తిగత అనుభవమో ఏమోకానీ ఈ భామ ప్రేమ గురించి చాలానే చెప్పింది. “ఈ తరం యువత ప్రేమలో పడడం సర్వసాధారణంగా మారింది. అయితే అందరి ప్రేమ సక్సెస్ కావడం లేదు. అలాగని ప్రేమలో విఫలమైన వారు ఇక జీవితమే లేదని బాధపడకూడదు… అది కరెక్ట్ కాదు. అలాంటి మానసిక వేదన నుంచి బయటపడాలి. ప్రేమించడం… ప్రేమించబడడం సహజం. ప్రేమించుకున్న వాళ్లందరూ పెళ్లి పీటలెక్కడం లేదు.

సామాజికపరమైన అంశాలు, తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వంటి అంశాలు కొందరి విషయంలో ఆటంకంగా మారుతున్నాయి. ప్రేమలో పడడంలాగే ప్రేమలో విఫలమవడం కూడా సాధారణ విషయమే. ప్రేమలో పడ్డా కూడా మనం ఏమిటన్నది మరచిపోకూడదు… మన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. మన ప్రాధాన్యతను ప్రేమ తగ్గించకూడదు. ప్రేమించిన వ్యక్తే జీవితం అనే స్థాయికి వెళ్లరాదు. ఒక వేళ ప్రేమలో విఫలమైనా అందుకు బాధపడకూడదు. దాని నుంచి వెంటనే బయటపడవచ్చు”అని చెబుతోంది కాజల్.

Kajal says that Love should not suffer if it fails

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: