పెళ్లి ఆలోచనే లేదు

  చిత్ర పరిశ్రమలో 50కి పైగా సినిమాలు చేసిన చెన్నై బ్యూటీ త్రిష. తెలుగు, తమిళ్‌లో ఎన్నో సూపర్‌హిట్ సినిమాల్లో నటించిన ఆమె కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈ సీనియర్ బ్యూటీకి ఎవరంటే ఇష్టమంటే… ఆసక్తికరమైన సమాధనం చెప్పింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కు తాను పెద్ద ఫ్యాన్ అని త్రిష పేర్కొంది. ఇక సౌత్‌లో మీరు పనిచేసిన హీరోల్లో ఎవరంటే ఇష్టం అని అడిగితే పెద్ద లిస్ట్ చెప్పింది. టాలీవుడ్, కోలీవుడ్‌లలో దాదాపు స్టార్ […] The post పెళ్లి ఆలోచనే లేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

చిత్ర పరిశ్రమలో 50కి పైగా సినిమాలు చేసిన చెన్నై బ్యూటీ త్రిష. తెలుగు, తమిళ్‌లో ఎన్నో సూపర్‌హిట్ సినిమాల్లో నటించిన ఆమె కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈ సీనియర్ బ్యూటీకి ఎవరంటే ఇష్టమంటే… ఆసక్తికరమైన సమాధనం చెప్పింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కు తాను పెద్ద ఫ్యాన్ అని త్రిష పేర్కొంది. ఇక సౌత్‌లో మీరు పనిచేసిన హీరోల్లో ఎవరంటే ఇష్టం అని అడిగితే పెద్ద లిస్ట్ చెప్పింది.

టాలీవుడ్, కోలీవుడ్‌లలో దాదాపు స్టార్ హీరోలు అందరి పేర్లు చెప్పేసింది. అజిత్, సిద్ధార్థ్, పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు, ప్రభాస్, ఎన్టీఆర్‌లు తన ఫేవరేట్‌లు అని పేర్కొంది. పెళ్లి గురించి అడిగితే మాత్రం డిఫరెంట్‌గా సమాధానమిచ్చింది. ప్రస్తుతానికి తన మనసులో పెళ్లి ఆలోచనే లేదని అంది. ఇప్పటికైతే సినిమాలు తప్ప వేరే వాటిపై దృష్టి పెట్టనని అంటోంది. కొంత కాలం క్రితం నిశ్చితార్థం పూర్తయి పెళ్లి ఆగిపోవడమే దీనికి కారణమైతే… ఇప్పట్లో తన పెళ్లికాదని త్రిష నిర్మొహమాటంగా చెప్పింది.

Trisha said is not Thinking of Marriage

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పెళ్లి ఆలోచనే లేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: